గోపీచంద్ మలినేని తన వరస సినిమాల్లో శృతి హాసన్ కి అవకాశాలు ఇవ్వడం, వీరసింహరెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గోపీచంద్ మలినేని శృతి హాసన్ కి ఐ లవ్ యు చెప్పడం, శృతి హాసన్ అదే స్టేజ్ పై గోపీచంద్ ని అన్నయ్య అని పిలవడంపై చాలా ట్రోల్స్ నడిచాయి. గోపీచంద్ కి శృతి హాసన్ కి మధ్యన సం థింగ్ సం థింగ్ అంటూ సోషల్ మీడియాలోనూ ఊహాగానాలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా గోపీచంద్ మలినేని శృతి హాసన్ తో తనకున్న బాండింగ్ పై క్లారిటీ ఇచ్చాడు. శృతి హాసన్ తో తాను బలుపు, క్రాక్, వీరసింహారెడ్డి మూవీస్ చేశాను.
శృతి హాసన్ మా ఇంట్లో మనిషి లాంటింది. నా వైఫ్ తోనూ ఆమె చాలా బావుంటుంది. నా కొడుకు అంటే శృతి హాసన్ కి చాలా ఇష్టం. బోలెడన్ని చాకలేట్స్ వాడి కోసం తెస్తూ ఉంటుంది. తనకి నేను బ్రదర్ లాంటి వాడిని, అందుకే శృతి ఆ స్టేజ్ పై అలా అన్నయ్య అని పిలిచింది. నేను కూడా అదే ప్రేమతో ఐ లవ్ యు చెప్పాను. కానీ ఒక ఆడా - మగా మధ్యలో ప్రేమే ఉంటుంది అంటూ మా మధ్యన ఏదో ఉన్నట్టుగా వైరల్ చేసారు. సోషల్ మీడియాలో అదంతా చూసి నవ్వుకున్నాను.
శృతి హాసన్ పై నాది బ్రదర్ బాండింగ్ మాత్రమే అని క్లారిటీ ఇచ్చిన గోపీచంద్ మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.