Advertisement
Google Ads BL

నాటునాటుగా.. చరణ్ అత్తగారి స్టెప్పులు


దర్శకధీరుడు రాజమౌళి చెక్కిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాట ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును పొంది.. ఆస్కార్‌కు అతి చేరువలో ఉంది. రీసెంట్‌గా ఈ పాటకి గోల్డెన్ గ్లోబ్ సత్కారం లభించింది. దీంతో గ్లోబల్ స్థాయిలో ఈ పాట గురించి చర్చలు నడుస్తున్నాయి. అయితే.. ఈ పాటకి చరణ్, ఎన్టీఆర్ కలిసి చేసిన డ్యాన్స్ ఒక ఎత్తయితే.. తాజాగా చరణ్ అత్తగారు శోభనా కామినేని డ్యాన్స్ మరో ఎత్తు అన్నట్లుగా సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి.

Advertisement
CJ Advs

అల్లుడు రామ్ చరణ్ డ్యాన్స్ చేసిన ‘నాటు నాటు’ పాటకి గ్లోబల్ స్థాయిలో గౌరవం దక్కడంతో.. అత్తగారు శోభనా కామినేని ఆనందంతో.. ఆ పాటకి డ్యాన్స్ చేశారు. ఆమె డ్యాన్స్ చేస్తున్న వీడియోని కూతురు ఉపాసన సరదాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ వీడియో సోషల్ మీడియాని షేక్ చేస్తూ తెగ వైరల్ అవుతోంది. అయితే ఆమె ఈ స్టెప్స్ వేసింది ఎక్కడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశానికి ప్రపంచ ప్రముఖులు తరలివస్తున్న స్విస్ పట్టణంలోని దావోస్‌ నగరంలో ఆమె ఇలా స్టెప్పులతో అలరించారు. ఈ వీడియోని షేర్ చేసిన ఉపాసన.. ‘ గ‌ర్వంగా ఫీల్ అవుతున్న అత్త‌గారు.. దావోస్‌లో నాటు నాటు స్టెప్పులు.. లవ్ యూ అమ్మ..’ అంటూ పోస్ట్ చేసింది. ఉపాసన షేర్ చేసిన ఈ పోస్ట్‌తో.. చరణ్ అత్తగారి పేరే కాదు.. రామ్ చరణ్ పేరు కూడా మరోసారి సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం విశేషం.

 

Mega Power Star Mother In Law Dance For Naatu Naatu Song:

Upsana Shared Video From Her Mother Naatu Naatu Steps
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs