Advertisement
Google Ads BL

దెబ్బకి దారికొచ్చిన రష్మిక


రష్మిక మందన్న గత ఏడాది ఆమె పేరు సినిమాల పరంగా కన్నా కాంట్రవర్సీలతోనే హైలెట్ అయ్యింది. తాను హీరోయిన్ గా లాంచ్ అయ్యింది సో కాల్డ్ ప్రొడక్షన్ హౌస్ అంటూ కాంట్రవర్సీకి తెరలేపిన రష్మిక మందన్న.. ఆ తర్వాత తనని హీరోయిన్ గా లాంచ్ చేసిన డైరెక్టర్ రిషబ్ శెట్టి నటించిన కాంతార చూడలేదంటూ మాట్లాడిన మాటలు ఆమెని చిక్కుల్లో పడేసాయి. అటు రిషబ్ శెట్టి కూడా రష్మిక మందన్నపై ఎప్పటికప్పుడు ఇండైరెక్ట్ గా విరుచుకుపడుతూనే ఉన్నాడు. 

Advertisement
CJ Advs

రష్మిక  కూడా ఏ మాత్రం తగ్గలేదు.. ఆ గొడవని కంటిన్యూ చేస్తూనే ఉంది. ఆ తర్వాత కన్నడ ఇండస్ట్రీ రశ్మికని బాన్ చేసే యోచనలో ఉంది అంటూ వార్తలు మొదలయ్యాయి. మధ్యలో రష్మిక ఈ గొడవకి ఫుల్ స్టాప్ పెట్టేందుకు రెడీ అయినా.. రిషబ్ మాత్రం ఊరుకోలేదు. ఈ గొడవ కొనసాగుతున్న సమయంలోనే కిర్రాక్ పార్టీ ఆరేళ్ళ సెలెబ్రేషన్స్ మరోసారి వీరి మధ్యన విభేదాలు చూపించింది.

అయితే తాజాగా రష్మిక మందన్న దారికొచ్చింది. దెబ్బకి దెయ్యం దిగిందా అన్న రేంజ్ లో రష్మిక మందన్న తనని కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశం ఇచ్చి ఇండస్ట్రీకి పరిచయం చేసింది రిషబ్ శెట్టి, రక్షిత్ శెట్టి అని చెప్పింది. తాను రక్షిత్ శెట్టి పక్కన హీరోయిన్ గా చేశాను. రిషబ్ శెట్టి నన్ను హీరోయిన్ గా లాంచ్ చేసారు. మా మధ్యన ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. కానీ నాపై లేనిపోని కాంట్రవర్సీలు క్రియేట్ చేసి ట్రోల్స్ చేస్తే ఊరుకునేది లేదు అంటూ రష్మిక ఓ వార్నింగ్ కూడా పడేసింది.

Finally Rashmika Hails Rakshit And Rishab Shetty!:

Rishab Shetty Finally Breaks Silence on Rashmika Mandann
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs