Advertisement
Google Ads BL

మనోజ్ చెప్పబోయేది పెళ్లి తేదీ గురించే


మంచు మనోజ్ కొద్దిరోజులుగా చాలా సైలెన్స్ ని మెయింటింగ్ చేస్తున్నాడు. ఆఖరికి సినిమాలు కూడా పక్కనపెట్టేసి ఫ్యామిలితోను డిస్టెన్స్ మెయింటింగ్ చేస్తున్నాడు. భార్య ప్రణతికి విడాకులిచ్చిన మంచు మనోజ్ తర్వాత ఒంటరిగానే ఉన్నాడు. అయితే కొద్ది రోజులుగా భూమన కరుణాకర్ రెడ్డి చిన్న కూతురు మౌనిక రెడ్డితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు మనోజ్. మౌనిక పేరెంట్స్ సమాధుల వద్ద పూజలు చేయడం, ఆమెతో వినాయక పూజలకు అటెండ్ అవ్వడం ఇలా.

Advertisement
CJ Advs

అయితే ఈ రోజు ఉన్నట్టుండి మంచు మనోజ్ జనవరి 20 న స్పెషల్ న్యూస్ ఇవ్వబోతున్నట్లుగా చెప్పి అందరిలో ఆత్రుతని పెంచేసాడు. నా హృదయానికి దగ్గరైన ఓ శుభవార్తని నాలోనే దాచుకుని ఉన్నాను, జీవితంలో మరో దశలోకి అడుగు వెయ్యబోతున్నందుకు సంతోషం గా ఉంది.. అంటూ ట్వీట్ చేసాడు. దానితో మనోజ్ చెప్పబోయేది మౌనిక రెడ్డితో వివాహం గురించే అనుకుంటున్నారు. అయితే మనోజ్ జనవరి 20న చెప్పబోయే స్పెషల్ న్యూస్ ఏమిటంటే.. మనోజ్-మౌనికల పెళ్లి ఫిబ్రవరి 2 న జరగబోతుంది అని, ఈమేరకు ముహుర్తాలు పెట్టి ఇరు కుటుంబాల వారు పెళ్ళికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం.

ఆమేరకు మంచు మనోజ్ అందరితో తన పెళ్లి తేదీ గురించి రివీల్ చేస్తాడని, ఈ శుభవార్తని అందరితో పంచుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. సో జనవరి 20న మనోజ్ రెండో వివాహంపై పూర్తి క్లారిటీ దొరుకుతుందన్నమాట.

Manchu Manoj is going to tell about the wedding date:

Manchu Manoj second marriage date is locked
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs