Advertisement
Google Ads BL

ఏంటి రాజుగారు ప్రభాస్ ని పట్టేశారా?


వారసుడు సినిమా ప్రమోషన్స్ లో టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజు చాలా ఆసక్తికర విషయాలు కాదు.. ప్రేక్షకులు సర్ ప్రైజ్ అయ్యే విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా ఆయన సెకండ్ మేరేజ్ విషయాలతో పాటుగా ఆయన తదుపరి ప్రాజెక్ట్ పై విపరీతమైన క్యూరియాసిటీ పెంచేశారు. ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో వారసుడు విడుదల కాగా.. RC15 షూటింగ్ జరుగుతుంది. రామ్ చరణ్-శంకర్ కలయికలో ఈ మూవీ క్రేజీగా మూడు భాషల్లో తెరకెక్కుతుంది. ఈ చిత్రం తర్వాత దిల్ రాజు కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో సినిమా చెయ్యబోతున్నట్టుగా ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచారు.

Advertisement
CJ Advs

కన్నడ మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో రావణం మూవీ చెయ్యబోతున్నట్టుగా ప్రకటించడంతో.. ఇప్పుడు ఆ కాంబోలో తెరకెక్కబోయే రావణం హీరో ప్రభాస్ అంటూ ఫాన్స్ సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టారు. ఇప్పటికే ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో సలార్ మూవీ చేస్తున్నారు. అలాగే ఆయన చేతిలో పలు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ఈ సమయంలో దిల్ రాజు రావణం కోసం ప్రభాస్ ని పట్టేశారనే న్యూస్ నడుస్తుంది. 

రావణం హాష్ టాగ్ ఓపెన్ చెయ్యగానే.. దిల్ రాజు-ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న రావణంలో ప్రభాస్ హీరో అని ప్రభాస్ ఫాన్స్ కూడా ఫిక్స్ అవుతున్నారు. మరి దిల్ రాజు ప్రభాస్ తో చర్చలు జరిపాకే ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించారో.. లేదంటే తర్వాత లాక్ చేద్దామనుకున్నారో కానీ.. హీరో పేరు లేకుండా ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి దిల్ రాజు అందరిని కన్ఫ్యూజ్ చేసారు.

Prabhas - Prashanth Neel Ravanam Under Dil Raju Banner:

Dil Raju announces Ravanam with Prashanth Neel
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs