Advertisement
Google Ads BL

ట్రోల్స్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ కౌంటర్


యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో డైలాగ్ చెబితే ఫాన్స్ కి పూనకాలే. ఎన్టీఆర్ ప్రతి డైలాగ్ ని స్పష్టంగా పవర్ ఫుల్ గా చెప్పగల నటుడు. అలాంటి నటుడిని పట్టుకుని ట్రోల్స్ చెయ్యడం ఎంతవరకు కరెక్ట్. అమెరికాలో నాటు నాటు సాంగ్ కి గోల్డెన్ గ్లొబ్ అవార్డు అందుకోవడానికి రాజమౌళి, కీరవాణి, రామ్ చరణ్ ఫ్యామిలీతో కలిసి హాజరైన ఎన్టీఆర్ అక్కడి మీడియాకి ఇంటర్వూస్ ఇస్తూ చాలా సందడి చేసాడు. అమెరికా యాస లో మాట్లాడూతూ ఎన్టీఆర్ నిజంగా అదరగొట్టేసాడు. ఎన్టీఆర్ అమెరికా యాసలో మట్లాడడం ఆయన ఫాన్స్ కి విపరీతంగా నచ్చగా.. కొంతమంది ఎన్టీఆర్ అమెరికన్ యాసపై పనిగట్టుకుని ట్రోల్ చేసారు. 

Advertisement
CJ Advs

అయితే అమెరికా స్పెషల్ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ ఈ ట్రోల్స్ పై ఇండైరెక్ట్ గా ఓ కౌంటర్ వేసాడు. ఒక్కో జోన్ లో ఒక్కో యాస ఉంటుంది. కాలమానం, యాసల పరంగా మన మధ్యన వ్యత్యాసం ఉండొచ్చు కానీ.. పశ్చిమ దేశాల్లో ఒక నటుడు ఎలాంటి విధానాన్ని అవలంబిస్తాడో.. తూర్పు దేశాల్లోనూ అదే పద్దతి ఫాలో అవుతారు.. అంటూ ఎన్టీఆర్ తన యాస పై వచ్చిన ట్రోల్స్ కి చెప్పకనే చెప్పే గట్టి కౌంటర్ పేల్చాడు.

Trolls on NTR English accent:

Jr NTR indirectly talks about being trolled for fake accent
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs