నటి అమలా పాల్ కి ఘోరమైన అవమానం జరిగింది. ఈమధ్యన సినిమాల కన్నా సోషల్ మీడియాలో ఎక్కువగా హడావిడి చేస్తున్న అమలా పాల్ తాజాగా కేరళలోని ఎర్నాకుళంలోని తిరువైరానికుళం మహాదేవ ఆలయంలో అమ్మవారి దర్శనానికి వెళ్ళింది. కానీ ఆ ఆలయంలోకి అన్యమతస్తులు రాకూడదని, కేవలం హిందూ భక్తులకు మాత్రమే అనుమతి ఉంటుంది అని అమల పాల్ ని అమ్మవారిని దర్శించుకోకుండా అక్కడి ఆలయ అధికారులు అడ్డుకోవడంపై అమలా పాల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
తనని ఆలయంలోపలికి అడ్డుకోవడంపై ఆలయ సందర్శకుల రిజిస్టర్‌లో ఇలా రాసింది. తాను అమ్మవారిని చూడలేకపోయినా మనసులోనే అమ్మవారిని ప్రార్ధించాను, అమ్మవారి ఆత్మను అనుభవించానని అమలాపాల్ ఆ రిజిస్టర్‌లో రాశారు. ఇప్పుడు ఈకాలంలోనూ అంటే 2023లోనూ మతపరమైన వివక్ష ఇంకా కొనసాగడం విచారకరమని అమలా పాల్ ఆవేదన వ్యక్తం చేసింది. ఆలయంలోకి తనను అనుమతించకపోవడంతో తీవ్ర నిరాశకు గురైనట్టుగా చెప్పిన ఆమె మతపరమైన వివక్షలో త్వరలోనే మార్పు వస్తుందని ఆశిస్తున్నట్టు అమలా పాల్ ఆ రిజస్టర్ లో రాసుకొచ్చింది.