ఆర్.ఆర్.ఆర్ చెయ్యడానికన్నా ముందు ఎన్టీఆర్-చరణ్ స్నేహితులు అని మాత్రమే తెలుసు. కానీ ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో వారి మధ్యన ఎంత స్నేహం ఉందో అనేది క్లియర్ గా చూపించారు. వారి మధ్యన ఫ్రెండ్ షిప్ ఎంత లోతుగా ఉందొ.. వీరిద్దరూ కలిసి ఎలా ఎంజాయ్ చేస్తారో ఇలా ప్రతి విషయాన్ని రివీల్ చేసారు. అయితే ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్ర కన్నా రామ్ చరణ్ రామరాజు పాత్ర బాగా హైలెట్ అయ్యింది అని మెగా ఫాన్స్, కాదు కొమరం భీమ్ ముందు అల్లూరి పాత్ర తేలిపోయింది అని నందమూరి అండ్ ఎన్టీఆర్ ఫాన్స్ గోల గోల చేసారు. ఆర్.ఆర్.ఆర్ ముందే నందమూరి vs మెగా ఫాన్స్ అన్న రేంజ్ లో అభిమానుల మధ్యన విభేదాలు ఉండేయి. వీరిద్దరూ కలిసి సినిమా చేసినా ఆ ఫాన్స్ వార్ మాత్రం ముగియలేదు. ఇంకాస్త ఎక్కువయ్యాయి.
రీసెంట్ గా అమెరికాలో ట్రిపుల్ ఆర్ పాటకి గోల్డెన్ గ్లొబ్ అవార్డు రావడంతో టీమ్ అంతా అక్కడ ఎంజాయ్ చేసింది, అంతేకాకుండా మీడియాకి ఇంటర్వూస్ ఇచ్చింది.
అయితే రామ్ చరణ్-ఎన్టీఆర్ లు ఈ ఇంటర్వూస్ లో ఫాన్స్ వార్ తో విసిగిపోయామని, అసలు అభిమానుల మధ్యన వచ్చే విభేదాల వలనే మేము ఫ్రెండ్స్ అయ్యాము, మేము ఎప్పుడూ ఫ్రెండ్స్‌లానే ఉంటాం. మా మధ్య ఎలాంటి వైరం లేదు అని అన్నారు. ప్రతి సందర్భంలో మేము కలిసి ఉన్నామని అభిమానులకి సందేశాన్ని ఇస్తున్నాం. వారి మధ్యన విభేదాలు రాకూడదని అనుకుంటున్నాము. ఆన్ స్క్రీన్ కానీ, ఆఫ్ స్క్రీన్ కానీ మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు.
ఒకరిపై మరొకరం ప్రేమను, అభిమానాన్ని చూపించుకొంటాం అని ఎన్టీఆర్ అన్నాడు, మేము స్నేహితులుగా చాలా సంతోషంగా ఉన్నామంటూ చరణ్ చెప్పాడు. మా మధ్యన ఉన్న స్నేహం అభిమానుల మధ్యన కూడా ఉండాలంటూ నందమూరి-మెగా అభిమానులకి పిలుపునిచ్చారు.