Advertisement
Google Ads BL

రజినీకి విలన్ గా సునీల్


టాప్ కమెడియన్ గా ఫుల్ ఫామ్ లో ఉన్న సునీల్ ని రాజమౌళి హీరోగా మార్చేశాడు. మర్యాద రామన్నతో హీరోగా సక్సెస్ సాధించిన సునీల్ తర్వాత కామెడీని పక్కనబెట్టి హీరో మైకం లో చాలా సినిమాలు చేసాడు. కానీ హీరోగా నిలదొక్కుకోలేకపోయాడు. కలర్ ఫోటో, రవితేజ సినిమాలో విలన్ వేషాలు వేసాడు. పుష్ప పాన్ ఇండియా మూవీ లో మంగళం శీనుగా విలన్ కేరెక్టర్ లో బావున్నాడు. కామెడీ పాత్రలు దొరకడం లేదో ఏమో.. మొత్తానికి సునీల్ విలన్ గా సెటిల్ అయ్యేలా కనబడుతున్నాడు.

Advertisement
CJ Advs

ఎందుకంటే కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కి సునీల్ విలన్ గా మారాడు. కోలీవుడ్ లో వరుణ్ డాక్టర్, బీస్ట్ చిత్రాల దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రజినీకాంత్ నటిస్తున్న జైలర్ మూవీలో సునీల్ విలన్ గా ఎంట్రీ ఇచ్చాడు. కన్నడ హీరో శివ‌రాజ్ కుమార్, మలయాళ హీరో మోహ‌న్ లాల్ లాంటి లెజెండ‌రీ న‌టులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. వీరికి ఇప్పుడు కమెడియన్ కమ్ విలన్ కమ్ హీరో సునీల్ కూడా తోడ‌య్యాడు. అయితే సునీల్ ది విలన్ రోల్ అని చెప్పకనే చెప్పే వయలెంట్ గా ఉన్న పోస్టర్ ని రివీల్ చేసారు.

దానితో సునీల్ జైలర్ లో విలన్ రోల్ పోషిస్తున్నాడనికి ఆడియన్స్ అందరూ ఫిక్స్ అయ్యారు. శివరాజ్ కుమార్ వన్ అఫ్ ద మెయిన్ విలన్ కాగా.. సునీల్ మరో విలన్ గా కనిపిస్తాడని ప్రచారం జరుగుతుంది. మరి ఈసారి నెల్సన్ దిలీప్ కుమార్ రజినీకాంత్ జైలర్ తో అద్భుతాలు సృష్టిస్తాడేమో చూడాలి.

Tollywood comedian enters Jailer:

Sunil enters Rajinikanth Jailer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs