ఒకే నిర్మాణ సంస్థనుండి రెండు సినిమాలు అందులోను మొదటి నుండి విపరీతమైన పోటీ ఉన్న హీరోల సినిమాలు రిలీజ్ చెయ్యడం అంటే మాములు విషయం కాదు. కత్తి మీద సామే. ఇప్పుడు మైత్రి వారికి అదే జరిగింది. బాలకృష్ణ-చిరంజీవి ఇద్దరూ చిన్న హీరోలు కాదు, అలాగని ఏమి పట్టించుకొని హీరోలు కాదు. ఇండస్ట్రీలో మొదటినుండి పోటీ పడిన ఈ హీరోలు చానళ్లకు మళ్ళీ సంక్రాంతి బరిలో కయ్యానికి కాలు దువ్వారు. ఇంకేముంది మధ్యలో మైత్రి వారి ఇరుక్కున్నారు. రిలీజ్ డేట్ దగ్గర నుండి ప్రమోషన్స్ వరకు ఏ హీరో తగ్గకూడదు. ఏ సినిమా ప్రమోషన్స్ లో చిన్న వెలితి కనిపించినా అటు హీరోలు, ఇటు అభిమానులు అస్సలూరుకోరు.
అలా జనవరి 12 న బాలకృష్ణ వీరసింహారెడ్డికి ముహూర్తం పెట్టగా, తర్వాత రోజు జనవరి 13 న చిరంజీవి వాల్తేర్ వీరయ్యకి ముహూర్తం పెట్టారు. ప్రమోషన్స్ కూడా సమానంగా చేసారు. రిజల్ట్ విషయంలో బాలయ్య కాస్త డల్ అయినా.. వాల్తేర్ వీరయ్యతో మెగాస్టార్ హిట్ కొట్టేసారు. అక్కడ మైత్రి వారు బ్యాలెన్స్ అయ్యారు. కానీ వీరసింహారెడ్డి-వాల్తేర్ వీరయ్య లెక్కల విషయం బయటపెడితే బాలయ్య ఊరుకోరు. తక్కువేస్తే బాలయ్యకి కోపం, చిరంజీవికి సంతోషంగా ఉంటుంది కానీ.. బాలయ్య చేతిలో అడ్డంగా దొరిపోవాలి.
అటు బాలయ్య ఇటు చిరు ఎవరికీ సర్ది చెప్పలేక అంకెలు చూపించకుండా కలెక్షన్స్ పోస్టర్స్ వేసి సరిపెట్టేసారు. మరి నిజం చెప్పాలంటే మైత్రి వారు బాలయ్యకి చిరుకి భయపడినట్లుగా వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్యల కలెక్షన్స్ బయటికి రాకూండా చూసినప్పుడే ప్రేక్షకులకి అర్ధమైపోయింది. లేదంటే రెగ్యులర్ గా లెక్కలు వేసే వెబ్ సైట్స్ లోను ఈ రెండు సినిమాల లెక్కలు కనిపించలేదంటే ఇంకేం అనుకోవాలి.