Advertisement
Google Ads BL

పవన్ తో పోటీకి సై అంటున్న ఆలీ


సినిమాల్లో కామెడీ చేస్తూ బాగా ఫెమస్ అయిన కమెడియన్ అలీ వైసిపీలో చేరి జగన్ కి భజన చెయ్యడం మొదలు పెట్టాడు. సీఎం ని పొగుడుతూ ప్రత్యర్దులని ముఖ్యంగా జనసేన నేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ జగన్ నుండి మంచి మార్కులు వేయించుకున్న అలీకి జగన్ ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవిని కట్టబెట్టారు. జగన్ కి విధేయుడిగా MLA టికెట్ ని అలీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు.

Advertisement
CJ Advs

తాజాగా అలీ తిరుపతిలో సంచనల కామెంట్స్ చేసాడు. తాను పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధమని డైరెక్ట్ గా చెప్పేసాడు. జగన్ ఎవరి మీద పోటీ చెయ్యమన్నా చెయ్యడానికి రెడీ, రాజకీయాలు వేరు సినిమాలు వేరు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు చాలా సహజమని, ఎవరు ప్రజలకి సేవ చేస్తారో, ఎవరు మేలు చేస్తారో అనేది ప్రజలకి బాగా తెలుసు అంటూ అలీ పవన్ కళ్యాణ్ పై డైరెక్ట్ వార్ డిక్లెర్ చేసాడు.

అయితే సినిమాల విషయానికి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అలీతో చాలా స్నేహంగా ఉండేవాడు. పవన్ సినిమా అనగానే ఆలీకి మంచి కేరెక్టర్ పడిపోయేది కానీ.. అలీ రాజకీయ అరంగేట్రం చేసాక అలీ కి పవన్ సినిమాల్లో కేరెక్టర్లు దొరకడం లేదు. రీసెంట్ గా అలీ కూతురు పెళ్ళికి పవన్ కళ్యాణ్ వెళ్లకపోవడంతో వీరిమధ్యన గ్యాప్ చాలా వచ్చేసింది అనే అనుకున్నప్పటికీ.. అలీ మాత్రం మీరే మా మధ్యన దూరం పెంచుతున్నారు, మా మధ్యన ఎలాంటి గ్యాప్ లేదని చెబుతున్నాడు.

Ali sensational comments on Pawan Kalyan:

Ali vs Pawan Kalyan in 2024 election
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs