ప్రశాంత్ నీల్ ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లోకి ఎక్కాడు. ఆయనతో సినిమా చెయ్యాలని స్టార్ హీరోలు ఉవ్విళ్లూరుతున్నారు. KGF సీరీస్ తో ప్రశాంత్ నీల్ పేరు ఇండియా వైడ్ ప్రేక్షకుల్లో మార్మోగిపోతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ సలార్ మూవీ చేస్తున్నాడు. తర్వాత మరో పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ తో NTR31 చెయ్యాల్సి ఉంది. ఇప్పుడు ఈ దర్శకుడితో దిల్ రాజు సినిమా చెయ్యబోతున్నట్టుగా వారిసు ప్రమోషన్స్ లో దిల్ రాజు ప్రకటించడం అందరిని ఆకర్షించింది.
కోలీవుడ్ వెళ్లి అక్కడి స్టార్ హీరో విజయ్ వారిసు/ వారసుడిని నిర్మించిన దిల్ రాజు ఆ సినిమా రిజల్ట్ తో హ్యాపీగా ఉన్నాడు. వారిసు ప్రమోషన్స్ లో భాగంగా దిల్ రాజు ప్రశాంత్ నీల్ తో సినిమా చేయబోతున్నట్టుగా ప్రకటించడమే కాదు తన నెక్స్ట్ చిత్రానికి రావణం టైటిల్ పెట్టేసినట్లుగా చెప్పడం అందరిని సర్ ప్రైజ్ చేసింది. హీరో, హీరోయిన్స్ పేర్లని మాత్రం రివీల్ చెయ్యని దిల్ రాజు.. బెస్ట్ వీఎఫ్‌ఎక్స్‌తో మూవీని తెరకెక్కించబోతున్నట్లు మాత్రం స్పష్టం చేశారు.
దిల్ రాజు బ్యానర్ నుండి భారీ చిత్రంగా వారిసు రిలీజ్ కాగా.. ప్రస్తుతం రామ్ చరణ్ తో కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ లాంగ్వేజెస్ లో RC 15 ని తెరకెక్కిస్తున్నాడు. తర్వాత రావణంతో దిల్ రాజు ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తాడో.. ఈ గొప్ప నిర్మాతకి, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తగిలితే ఎలా ఉంటుందో చూడాలి.