Advertisement
Google Ads BL

తరచూ పబ్లిక్ లోకి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ


గతంలో బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ పెద్దగా బయట కనిపించేవాడు కాదు. అక్క పెళ్లిలోను మోక్షజ్ఞ కనిపిస్తాడేమో అని అభిమానులు ఆశపడినా అది జరగలేదు. తర్వాత కూడా మోక్షజ్ఞ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆరాటంలో ఉన్నారు. కానీ ప్రతిసారి అభిమానులు డిస్పాయింట్ అవుతూనే ఉన్నారు. మోక్షజ్ఞ నటనలో మెళుకువలు నేర్చుకుంటున్నాడు, అందుకే ఆయన బయట కనిపించడం లేదు అనుకున్నారు. కానీ మోక్షజ్ఞ మాత్రం బరువుగా కనిపిస్తూనే ఉన్నాడు. హీరో అవ్వాలంటే సిక్స్ ప్యాక్ బాడీ లేకపోయినా.. హ్యాండ్ సమ్ గా కనిపించాలి. కానీ మోక్షజ్ఞ మాత్రం అలాంటిదేం పట్టించుకోవడం లేదు, హీరో అవ్వాలనే పట్టుదల లేనట్లుగానే ఉంది.

Advertisement
CJ Advs

ఇప్పుడు కొద్దిరోజులుగా మోక్షజ్ఞ జనంలోనే ఉంటున్నాడు. తండ్రి పుట్టిన రోజు వేడుకల కోసం టర్కీ వెళ్ళాడు. అలాగే తండ్రి వీరసింహారెడ్డి సినిమా చూడడానికి హైదరాబాద్ లోని GVK మాల్ లో కనిపించాడు. అలాగే హిట్2 సినిమాని ప్రసాద్ ల్యాబ్ లో తండ్రితో కలిసి చూడడం.. ఇప్పుడు సంక్రాంతి సంబరాల కోసం చంద్రబాబునాయుడు ఊరు నారావారిపల్లెకు వెళ్లడం, అక్కడ మేనల్లుళ్లు, బావ లోకేష్ తండ్రి బాలయ్యతో కలిసి సందడి చేసాడు. ఎప్పటికప్పుడు మోక్షజ్ఞ ఫొటోస్ సోషల్ మీడియాలో కనబడుతున్నాయి.

ఒకప్పుడు కనిపించని.. మోక్షజ్ఞ ఇప్పుడు తరుచూ పబ్లిక్ లోనే కనిపిస్తున్నాడు. మరి త్వరలోనే మోక్షజ్ఞ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని నందమూరి అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.

Mokshagna at Sankranthi celebrations:

Nandamuri Mokshagna and Balayya at Sankranthi celebrations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs