Advertisement
Google Ads BL

రష్మిక ఆనందం చూసారా..


రష్మిక మందన్న ఈ పేరు గట్టిగా మోగిపోతుంది, కోలీవుడ్ లో విజయ్ తో కలిసి వారిసు హిట్ తో ఇక ఎక్కడా ఆగదు అనుకున్నారు. కానీ వారిసు హిట్ రష్మికకి అంత సంతోషం ఇవ్వలేదు. కారణం రష్మిక మందన్న వారిసు సినిమాలో పాటల కోసం యాక్ట్ చేసింది. రష్మిక కేరెక్టర్ ని ఓ హీరోయిన్ పెద్ద సినిమాలో ఉండాలి అని పెట్టారు కానీ.. లేదంటే అసలు హీరోయిన్ కేరెక్టర్ కి స్కోప్ లేదు. అయినా రష్మిక వారిసుతో తమిళంలో మొదటి హిట్ కొట్టేసింది. ఆ సినిమా సక్సెస్ లో రష్మిక భాగమైపోయింది.

Advertisement
CJ Advs

అయితే ఆ సక్సెస్ పై రష్మిక మాట్లాడుతూ తాను సినిమాల్లోకి అడుగుపెట్టి ఆరేళ్ళయింది. ఎంతోమంది నటులు, ప్రతిభావంతులైన హీరోయిన్స్ ఉన్నప్పటికీ తనకి అన్ని భాషల్లో అవకాశాలు లభిస్తున్నాయి, అది తన అదృష్టమని, తన శ్రమకి తోడు దర్శకనిర్మాతల చేయూత, ప్రేక్షకుల ప్రేమాభిమానాలు, అన్నిటికి మించి దేవుడి ఆశీస్సులు ఉన్నాయని, అందుకే ఇన్ని విజయాలు సాధించాను, నేను ఇతరుల ను గౌరవిస్తాను, వారి ప్రయత్నాన్ని ఇష్టపడతాను. ఇక నటిగా నిత్యం నేర్చుకుంటూనే ఉంటాను.

సాధ్యమైనంతవరకు అభిమానుల మనసులో చోటు సంపాదించుకుంటాను.. అంటూ రష్మిక వారిసు విజయంపై తన స్పందనని తెలిపింది. 

Rashmika happy with Varisu success:

Rashmika Mandanna on Varisu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs