సమంత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వినిపించడంలేదు, పబ్లిక్ లో కనిపించడం లేదు. పాన్ ఇండియా స్టార్ గా సమంతకి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ నుండి ఇండియా వైడ్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంది. చైతూ తో విడిపోయినా సమంత కెరీర్ పరంగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఆమె అనారోగ్య సమస్యల కారణంగా కొన్నాళ్లుగా ఇంటిపట్టునే విశ్రాంతి తీసుకుంటుంది. అయినప్పటికీ.. ప్రేక్షకుల హృదయాల్లో సమంతనే ఆరాధిస్తున్నారు. అదే విషయం ఓరామ్యాక్స్ సంస్థ బయటపెట్టింది.
ప్రతి నెల ఓరామ్యాక్స్ సంస్థ స్టార్స్ కు సంబంధించిన ర్యాంకులను విడుదల చేస్తుంది. అలా డిసెంబర్లో ఏ హీరోయిన్ ఏ స్థానంలో నిలిచింది అనే ర్యాంక్స్ విడుదల చేయడం జరిగింది. ఆ ర్యాంక్స్ లో సమంత అందరిని అంటే బాలీవుడ్ హీరోయిన్స్ న్మి కూడా వెనక్కి నెట్టేసి మరీ మొదటి స్థానంలో కూర్చుంది. శాకుంతలం అప్ డేట్స్, యశోద రిజల్ట్ తో సమంత ఫస్ట్ ప్లేస్ లోకి రాగా.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సెకండ్ ప్లేస్ లో ఉంది. మూడో స్థానంలో లేడీ సూపర్ స్టార్ నయనతార నిలవగా బాలీవుడ్ హీరోయిన్ దీపికా నాలుగో స్థానాన్ని నిలబెట్టుకుంది.
ఆ తర్వాత ప్లేస్ లో కాజల్ అగర్వాల్ ఉండగా, రశ్మిక్ మందన్న ఏడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో కత్రినా కైఫ్, తమన్నా, చివరిగా పదో స్థానంలో కీర్తి సురేష్ నిలిచారు.