Advertisement
Google Ads BL

బాక్సాఫీసు జోరు: వీరయ్య కుమ్ముడు


వీరసింహారెడ్డి-వాల్తేర్ వీరయ్యలు నువ్వా - నేనా అని బాక్సాఫీసు బరిలో కొట్టుకున్నాయి. బాలకృష్ణ వీరసింహారెడ్డికి విడుదలకు ముందు విపరీతమైన హైప్, ప్రేక్షకుల్లో అంచనాలున్నాయి. ఎంత కాదనుకున్నా వీరసింహారెడ్డి ముందు మెగాస్టార్ వాల్తేర్ వీరయ్యకి కూసింత అంచనాలు తక్కువే ఉన్నాయి. కానీ సినిమాలు విడుదలయ్యాక కానీ అసలు రంగు బయటపడలేదు. బాలకృష్ణ వీరసింహారెడ్డి ని ఆడియన్స్, అభిమానులు ఆహా ఓహో అన్నప్పటికీ.. వాల్తేర్ వీరయ్య సినిమా రిలీజ్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. పూనకాలు లోడింగ్ అంటూ మెగాస్టార్ థియేటర్స్ లో దున్నేస్తున్నారు. 

Advertisement
CJ Advs

ప్రీ రిలీజ్ బజ్ లో ముందంజలో ఉన్న వీరసింహారెడ్డి.. వీరయ్య రాకతో డంగైపోయింది. వాల్తేర్ వీరయ్య కి మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా.. ఆడియన్స్ మాత్రం వీరయ్యకు ఓటేశారు. మాస్ ఆడియన్స్ మాత్రమే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వాల్తేర్ వీరయ్య థియేటర్స్ కి క్యూ కట్టారు. దానితో మూడు రోజుల్లోనే 100 కోట్ల క్లబ్బులోకి వీరయ్య అడుగుపెట్టినట్టుగా నిర్మాతలు అఫీషియల్ గా పోస్టర్ వేశారు. ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో వాల్తేర్ వీరయ్య 108 కోట్ల గ్రాస్ కొల్లగొట్టినట్టుగా ప్రకటించారు.

మెగాస్టార్ ఏనుగుపై ఎక్కిన పోస్టర్ తో పాటుగా ఈ కలెక్షన్స్ ని ప్రింట్ చేసి మరీ వదిలారు. దానితో పూనకాలు లోడింగ్ అంటూ మెగా ఫాన్స్, మెగాస్టార్ బాక్సాఫీసు జాతరలో కలెక్షన్స్ సునామీతో ఇరక్కొట్టేస్తున్నారు. బాక్సాఫీసు జోరు-వీరయ్య కుమ్ముడు అంటూ నెటిజెన్స్ కామెంట్ చేస్తున్నారు.

Box Office Joru: Veeraya Kummudu:

Waltair Veerayya going great guns in US
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs