Advertisement
Google Ads BL

రష్మిక సంతోషంగా ఉందా? లేదా?


ఏడాది క్రితం అల్లు అర్జున్ తో కలిసి నటించిన పుష్ప చిత్రం పాన్ ఇండియా హిట్ అవడంతో రష్మిక మందన్న పేరు ఇండియా వైడ్ గా మార్మోగిపోయింది. పుష్ప ద రైజ్ లో శ్రీవల్లిగా రష్మిక డీ గ్లామర్ గా కనిపించినా ఆమె పెరఫార్మెన్స్ ని అందరూ మెచ్చారు. అంతకన్నా ముందే ముంబైలో అడుగుపెట్టి బాలీవుడ్ మూవీ ఆఫర్స్ పట్టుకున్న రష్మిక ఎక్కువగా ముంబైలో ఉంటుంది. మధ్యలో తమిళనాట కార్తీ తో చేసిన సుల్తాన్ డిసాస్టర్ తో కోలీవుడ్ ఎంట్రీ ఆమెని నిరాశ పరిచింది. కానీ గత ఏడాది వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రష్మిక తన కలల హీరో విజయ్ తో కలిసి వారిసు లో నటించింది. ఆ మూవీ ఈ పొంగల్ సందర్భంగా తమిళంలో, తెలుగులో విడుదలైంది.

Advertisement
CJ Advs

అయితే తమిళంలో ఆహా ఓహో అనకపోయినా.. సినిమాకి యావరేజ్ టాక్ వచ్చి బెటర్ కలెక్షన్స్ వస్తున్నాయి. తెలుగులో మాత్రం వారసుడు చిత్రానికి ప్లాప్ టాక్ పడింది. కనీసం వారసుడికి మిక్స్డ్ రివ్యూస్ రాకపోవడం, పెద్ద హీరోలు బాలకృష్ణ-చిరంజీవి సినిమాలు ఈ పండగకు రావడంతో ఆ సినిమాల మధ్యన వారసుడు సంక్రాంతికి కొట్టుకుపోయింది. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా కనబడిన రష్మిక పేరు మోగిపోతుంది, అమ్మడుకి తమిళంలో మొదటి హిట్ పడిపోయింది అనుకుంటే.. వారిసు కానీ, వారసుడులో కానీ రష్మిక పేరు అస్సలు వినిపించలేదు. జస్ట్ పాటల్లో లో అలా వచ్చి ఇలా వెళ్ళిపోయింది.. అక్కడక్కడా ఏవో కొన్ని డైలాగ్స్ తో ఉనికిని చాటుకుంది తప్ప రశ్మికకి వారిసు వల్ల వరిగింది ఏమి లేదు.

అదే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లయితే రష్మికకి ఆ సినిమాలో చిన్న పాత్రే అయినా పేరు మోగిపోయేది. కానీ వారిసుకు అంత పెద్ద టాక్ రాకపోవడంతో రష్మిక పేరు అంతగా వినిపించలేదు. అందుకే రష్మిక ఇప్పుడు విజయ్ వారిసు రిజల్ట్ తో సంతోషంగా పండగ చేసుకోవాలో.. లేదంటే బాధపడాలో అర్ధంకాని పరిస్థితిలో ఉండి ఉంటుంది.

Is Rashmika happy or Unhappy?:

Why is Rashmika Mandanna feeling sad?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs