Advertisement
Google Ads BL

నిజంగా సితార బాపు బొమ్మే


మహేష్ బాబు కుమార్తె సితార నిజంగా కుందనపు బొమ్మే. చిట్టిపొట్టి డ్రెస్సులతో, మెస్మరైజ్ చేసే ఫోటో షూట్స్ మాత్రమే కాదు.. కళ్ళని అలా అలా తిప్పుతూ అభినయిస్తుంది చూడండి.. మహేష్ లోని అందం, నటన, తల్లి అణుకువ, నటనని పుణికిపుచ్చుకున్న సితార అటు ట్రెడిషనల్ గా కూచిపూడి డాన్స్ తో అదరగొట్టేస్తుంది. సితార స్టార్ కిడ్ గానే ఫెమస్ కాదు, ఆమె ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. యూట్యూబ్ వీడియోస్, డాన్స్ ఇలా ఎందులోనైనా సితార బెస్ట్ అనిపిస్తుంది.

Advertisement
CJ Advs

ఈరోజు సంక్రాంతి పండుగ స్పెషల్ గా సితార క్యూట్ గా అందంగా ఉన్న వీడియోని షేర్ చేసింది నమ్రత శిరోద్కర్. ఆ వీడియో లో మహేష్ నటించిన మురారి సినిమాలోని అద్భుతమైన సాంగ్ బంగారు కళ్ళ బూచమ్మో, కోపంలో ఎంత ముద్దమ్మో.. అంటూ అప్పట్లో హీరోయిన్ సోనాలి బింద్రే ఎంత చక్కగా ఎక్సప్రెషన్స్ ఇచ్చిందో అంతకుమించి అనేలా సితార ఆ పాట లిరిక్స్ కి ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ నిజంగా అద్భుతమే. బాపు బొమ్మలా రెడీ అయ్యి తండ్రి పాటకు సితార ఇచ్చిన ఎక్సప్రెషన్స్ ఆ వీడియోలో హైలెట్ అయ్యాయి. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ వీడియోని నమ్రత పోస్ట్ చేసింది.

సితార నిజంగా తెలుగింటి అమ్మాయిలా.. సాంప్రదాయకమైన దుస్తుల్లో మెరిసిపోయింది. ఆ వీడియో ని మహేష్ ఫాన్స్ షేర్ లు చేస్తూ లైక్స్ కొడుతూ హడావిడి చేస్తున్నారు.

Sitara stunning Sankranthi video go viral:

Mahesh Babu daughter Sitara stuns with traditional
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs