సంక్రాంతి స్పెషల్ గా విడుదలైన నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ చిత్రం వీరసింహరెడ్డికి మిక్స్డ్ రివ్యూస్ వచ్చినప్పటికీ.. బి, సి సెంటర్స్ తో మాస్ ఆడియన్స్ హడావుడితో దుమ్మురేపుతోంది. మాస్ ఆడియన్స్ విజిల్స్ తో, వారు చేసే రచ్చ వీరసింహరెడ్డి థియేటర్స్ దడదడలాడిపోతున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ డ్యూయెల్ రోల్ చేసిన ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. బాలకృష్ణ సీనియర్ కేరెక్టర్ లుక్ విషయంలో మాస్ ఫ్ఫాన్స్ బాగా ఇంప్రెస్స్ అయ్యారు. వీరసింహరెడ్డి కలెక్షన్స్ పరంగా ఊచకోత కొస్తుంది.
థియేటర్స్ లో హిట్ అయిన వీరసింహారెడ్డి సంక్రాంతి హిట్ అంటూ నందమూరి ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే బాలకృష్ణ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం అఖండ ఓటిటి రైట్స్ ని దక్కించుకున్న ప్రముఖ ఓటిటి సంస్థ డిస్ని ప్లస్ హాట్ స్టార్ వీరసింహారెడ్డి చిత్రాన్ని కూడా భారీ ధరకు కొనుగోలు చేసినట్టుగా తెలుస్తుంది. వీరసింహారెడ్డి టైటిల్ కార్డ్స్ లోనే ఓటిటి పార్ట్నర్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అంటూ రివీల్ చేసేసారు. సో వీరసింహారెడ్డి ని ఓటిటిలో ఓ ఏడెనిమిది వారాలు వెయిట్ చేసేసి డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో వీక్షించాల్సిందే.