Advertisement
Google Ads BL

గోపీ చేతికి బాలయ్య ఇచ్చిన రామబాణం


మాచో స్టార్ గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌లది టాలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్‌. లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్లను అందించారు. ఇప్పుడు మూడో సారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌లో టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల కలిసి నిర్మిస్తున్నారు.ఇందులో హీరో గోపీచంద్ సరసన నాయికగా డింపుల్ హయతి నటిస్తుండగా, జగపతి బాబు,అన్నయ్యగా, కుష్బూ వదిన గా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Advertisement
CJ Advs

గోపీచంద్ కెరీర్‌లో 30వ సినిమాగా రాబోతోన్న ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు ప్రస్తుతం  ముగింపు దశలో ఉన్నాయి. 

సంక్రాంతి శుభవేళ చిత్రం పేరు ను రామబాణం గా ప్రకటిస్తూ  చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రం ఆకట్టుకుంటోOది. యువరత్న నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం విశేష ప్రేక్షకాదరణ పొందు తోందన్న విషయం విదితమే. ఈ కార్యక్రమంలో నే యంగ్ రెబల్ స్టార్  ప్రభాస్, మాచో స్టార్ గోపీచంద్ లు పాల్గొన్న సందర్భంలో, అదికూడా వెండితెరపై శ్రీరాముడు పాత్రను సమున్నత రీతిలో అద్వితీయంగా పోషించిన యువరత్న బాలకృష్ణ గారి ద్వారా చిత్రం పేరును రామబాణం  గా ప్రకటించడం తమకెంతో ఆనందాన్ని కలిగించిందని పేర్కొన్నారు చిత్ర దర్శకుడు శ్రీవాస్, నిర్మాతలు టి జి. విశ్వ ప్రసాద్, వివేక్ కూచిభొట్ల

ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు సామాజిక సందేశం కూడా మిళితమైన బలమైన కథాంశం ఉన్న చిత్రమిది. ఈ చిత్రంలో సరికొత్త గోపీచంద్‌ను చూడబోతున్నారు.లక్ష్యం, లౌక్యం వంటి విజయవంతమైన చిత్రాల తరువాత మళ్లీ గోపీచంద్, శ్రీవాస్ లు కలసి పనిచేయటంతో హ్యాట్రిక్ కొట్టబోతున్నారన్న అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి. ఆ రెండు సినిమాలను మించేలా ఉండాలని  ఈ సినిమా ని శ్రీవాస్  ఓ బాధ్యత తో తీర్చి దిద్దుతున్నాడు. 

Title Announced As Rama Banam:

Screen RAMA Announced RAMABANAM
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs