గత ఏడాది మాస్ మహారాజ్ రవితేజ కి బ్యాక్ టు బ్యాక్ రెండు దెబ్బలు గట్టిగా తగిలాయి. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ డిసాస్టర్ తర్వాత రవితేజ కాస్త డల్ అయినా.. ధమాకా మోత తో మరోసారి పైకి పైకి వెళ్ళిపోయాడు. రవితేజ ధమాకాకి మొదటి రోజు నెగెటివ్ టాక్ వచ్చినా, సినిమా 100 కోట్ల మార్క్ ని రీచ్ అయ్యి రవితేజ స్టామినాని ప్రూవ్ చేసాడు. దానితో రవితేజ మార్కెట్ మరోసారి పెరిగింది. తాజాగా చిరంజీవి వాల్తేర్ వీరయ్య తో రవితేజ మరో హిట్ కొట్టాడు. నిన్న విడుదలైన వాల్తేర్ వీరయ్యకి పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాతో కలిపి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడంతో రవితేజ మరోసారి తన రెమ్యునరేషన్ హైక్ చేస్తాడనే ప్రచారం మొదలయ్యింది.
ఖిలాడీ సినిమా అప్పుడే రవితేజ నిర్మాతలను గట్టిగా డిమాండ్ చేస్తున్నాడని అన్నారు. రామారావు ఆన్ డ్యూటీ కూడా డిసాస్టర్ అవడంతో రవితేజ సైలెంట్ అయినా.. ఇప్పుడు ధమాకా, వాల్తేర్ వీరయ్య ల హిట్స్ తో రవితేజ మళ్ళీ ఫామ్ లోకి వచ్చేసాడు. ఆటోమాటిక్ గా అతని మర్కెట్ కూడా పెరిగిపోతుంది. దానికి తగ్గట్టే డిమాండ్ చేస్తాడని, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సూత్రాన్ని రవితేజ పర్ఫెక్ట్ గా అమలు చేసే రకం అని సినిమా ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం రవితేజ రావణాసుర, టైగర్ నాగేశ్వరావు సినిమాలు సెట్స్ మీదున్నాయి. టైగర్ నాగేశ్వరరావు తో రవితేజ పాన్ ఇండియా మార్కెట్ లోకి కూడా అడుగుపెట్టబోతున్నాడు.