పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తర్వాత క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో వున్నారు. 45 రోజుల పాటు ఏకధాటిగా సాగిన హరి హర వీరమల్లు యాక్షన్ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ చిత్రంతో పాటుగా పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ మొదలు పెట్టారు. భవదీయుడు భగత్ సింగ్ అంటూ ఎప్పుడో టైటిల్ రివీల్ చేసి సినిమా అనౌన్స్ చేసిన మైత్రి మూవీస్-హరీష్ శంకర్ లు ఫైనల్ గా టైటిల్ చేంజ్ చేసి ఉస్తాద్ భగత్ సింగ్ గా పవన్ కళ్యాణ్ ని పోలీస్ ఆఫీసర్ గా చూపించడానికి రెడీ అయ్యాడు. గత నెలలోనే ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరిగాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలు కాబోతుంది.
అయితే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ నుండి అదిరిపోయే అప్ డేట్ వచ్చేసింది. ఇది విన్న పవన్ ఫాన్స్ కి గూస్ బంప్స్ రావాల్సిందే. తెలుగు ర్యాపర్ ప్రణవ్ చాగంటి ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో నేను ఉస్తాద్ భగత్ సింగ్‌లో ఇంట్రో ట్రాక్ రెడీ చేశాను. పవన్ కళ్యాణ్ సినిమా లో ఈ ట్రాక్ చేసే అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ హరీశ్ శంకర్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. చిత్రంలో ఈ ట్రాక్ వచ్చినప్పుడు మామూలుగా ఉండదు. ఇప్పటి వరకూ పవన్ కల్యాణ్ గారి ఇంట్రో ట్రాక్స్‌లో ఈ ట్రాక్ ది బెస్ట్ అవుతుంది. నా మాటలు రాసి పెట్టుకోండి.. అంటూ పవన్ ఫాన్స్ లో ఉత్సాహాన్ని రెట్టింపు చెయ్యడం కాదు.. వాళ్ళకి ఈ అప్ డేట్ తో గూస్ బంప్స్ తెప్పించాడు.
ఈ వీడియోని పవన్ ఫ్యాన్ ఒకరు సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా.. హరీశ్ శంకర్ స్పందిస్తూ థమ్స్ అప్ ఎమోజీలు పెట్టాడు. దీనితో సినిమాపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ చిత్రం కోసం పూజ హెగ్డే ని హీరోయిన్ గా సెట్ చేసేపనిలో హరీష్ శంకర్ ఉన్నట్లుగా తెలుస్తుంది.