సీనియర్ నటి జయసుధ రెండో భర్త కొద్ది రోజుల క్రితం సూయిసైడ్ చేసుకుని మరణించారు. తర్వాత జయసుధ తన ఇద్దరి బిడ్డలతోనే ఉంటున్నారు. ఒకప్పుడు ఏఎన్నార్, ఎన్టీఆర్, కృష్ణ ఇలా హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జయసుధ తర్వాత కేరెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో 50 ఏళ్ళ జర్నీ పూర్తి చేసుకున్న జయసుధ రీసెంట్ గా మూడో పెళ్లి చేసుకున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఈ రూమర్స్ పుట్టడానికి కారణం జయసుధ ఈ మధ్యన ఏ ఫంక్షన్ కి వెళ్లినా, ఏ సినిమా లొకేషన్ లో కనిపించినా ఆమె వెంట ఓ వ్యక్తి తరుచూ రావడంతో ఈ రూమర్స్ పుట్టాయి.
అయితే తాజాగా జయసుధ తన మూడో పెళ్లి వార్తలపై రియాక్ట్ అయ్యారు. తాను మూడో పెళ్లి చేసుకున్నానని వస్తున్న వార్తల్లో నిజం లేదని, తనతో కలిసి వస్తున్న వ్యక్తి పై కూడా జయసుధ పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఆయన తన బయోపిక్ తియ్యబోతున్నారంటూ జయసుధ ఆ వ్యక్తి గురించి పూర్తిగా చెప్పారు. ఆయన అమెరికాకి చెందిన వ్యక్తి, నా గురించి తెలుసుకోవడానికే ఆయన ఇండియా కి వచ్చారు. నా గురించి ఇంటర్నెట్ లో చూసి తెలుసుకున్నది చాలక నా గురించి పూర్తిగా రీసెర్చ్ చెయ్యడానికే ఆయన ఇండియాకి వచ్చారు.
నా ఫాలోయింగ్ ఎలా ఉందో చూడడానికి, నా కెరీర్ ఇంకా ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆయన నాతోపాటు నేను వెళ్ళే ఈవెంట్స్ కి, షూటింగ్ స్పాట్స్ కి వస్తున్నారు.. అంతే తప్ప తమ మధ్యన ఇంకేమి లేదు, కొద్దిరోజుల క్రితం అమెరికా వెళ్లి ఆయన్ని కలిసాను అంటూ జయసుధ తన పెళ్లిపై వస్తున్న వార్తలను కొట్టిపారేశారు.