ప్రస్తుకితం ఆర్.ఆర్.ఆర్ హీరోలు రామ్ చరణ్-తారక్ లు అమెరికాలో సందడి చేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ నాటు నాటు సాంగ్ కి గోల్డెన్ గ్లొబ్ అవార్డు అందుకోవడానికి రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి ఫామిలీస్ తో సహా అమెరికా వెళ్లారు. అక్కడ రామ్ చరణ్, తారక్ లు విడివిడిగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఇక్కడి అభిమానులని సర్ ప్రైజ్ చేస్తున్నారు. గోల్డెన్ గ్లొబ్ అవార్డు అందుకున్న రామ్ చరణ్ మీడియాతో మాట్లాడాడు.
మెగా ఫ్యామిలీ పోటీ పై, అలాగే నందమూరి హీరోలతో పోటీపై రామ్ చరణ్ అక్కడ మీడియాతో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసాడు. తారక్ తాతగారు సీనియర్ ఎన్టీఆర్ ఆర్ తో మా నాన్నగారు చిరంజీవికి మధ్యన పోటీ ఉండేది కానీ అది ఆరోగ్యకరమైన పోటీ ఉండేది. 30 ఏళ్ల నుంచి తమ కుటుంబానికి, ఎన్టీఆర్ కుటుంబానికి మధ్య ఆరోగ్యకర పోటీ వాతావరణం చెప్పిన రామ్ చరణ్ మెగా ఫ్యామిలీ హీరోలతో ఉండే పోటీపై కూడా మాట్లాడాడు. మెగా ఫ్యామిలిలో ఏడుగురు హీరోలున్నారు. మెగా కజిన్స్ మధ్యన కూడా పోటీ ఉంటుంది అంటూ చరణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి.
అదే ఇంటర్వ్యూలో చరణ్ తారక్ తో మరో సినిమా చెయ్యాలనుకుంటున్నట్టుగా ఎన్టీఆర్-మెగా ఫాన్స్ కి గుడ్ న్యూస్ కూడా చెప్పాడు.