Advertisement
Google Ads BL

పవన్ పై కౌంటర్ ఎటాక్ చేసిన రోజా


రాజకీయాల్లో కామెంట్స్ ప్రతి కామెంట్స్, కౌంటర్ ప్రతి కౌంటర్ అనేవి సర్వసాధారణం. అయితే చేతిలో అధికారం పెట్టుకుని ఎంతమాట బడితే అంత మాట, ఏ పని బడితే ఆ పని చెయ్యొచ్చనే అధికార మదంతో ఉన్న వైసిపి నాయకులకి జనసేనాని పవన్ కళ్యాణ్ కాలులో ముల్లులా తయారయ్యారు. పవన్ కళ్యాణ్ ని ఎవరైతే కామెంట్ చేస్తున్నారో.. ఎవరికి దాచుకోకుండా ప్రతి కౌంటర్ తో పాటుగా పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఒణుకు తెప్పిస్తున్నారు పవన్. ఒక్క జనసేనాని ఎదుర్కోవడానికి వైసిపీ మంత్రులు పొలోమని బయలుదేరుతున్నారు. ఈమధ్యన మంత్రి రోజా జగన్ దగ్గర మంచి మార్కులు కొట్టెయ్యడానికి మెగాస్టార్ దగ్గర నుండి నాగబాబు, పవన్ కళ్యాణ్ ని నోటికొచ్చినట్లుగా మాట్లాడారు.

Advertisement
CJ Advs

ప్యాకేజి స్టార్ అంటూ పవన్ ని దూషించారు. మెగాస్టార్ ఎవరికీ సహాయం చేయలేదంటూ మట్లాడారు. దానికి ప్రతి కౌంటర్ పవన్ కళ్యాణ్ నిన్నటి యువశక్తి సభలో వేశారు. డైమండ్ రోజా కూడా నా గురించి మాట్లాడుతుంది. చివరికి నువ్వు కూడానా.. ఛీ నా బ్రతుకు చెడ అంటూ స్ట్రాంగ్ గా రోజాకి ఇచ్చిపడేసారు. మరి రోజా ఎందుకూరుకుంటుంది. ఆమె కూడా పవన్ కళ్యాణ్ కి కౌంటర్ ఎటాక్ చేసింది. రెండుసార్లు గెలిచిన నేను, రెండు చోట్ల ఓడిపోయిన ప‌వ‌న్‌క‌ల్యాణ్‌. నీతో తిట్టించుకోవాలా, థూ.. ప్ర‌జ‌ల కోసం త‌ప్ప‌ట్లేదు. ప్యాకేజీస్టార్ పవన్ కళ్యాణ్ అంటూ స్ట్రాంగ్ గా స్పందించింది.

మరోపక్క మెగాస్టార్ కూడా రోజా కి ఎక్కడ నటించాలో అక్కడ నటించారు. నేను ఎవరికీ సహాయపడలేదా.. మంత్రి పదవి వచ్చాక రోజా మా ఇంటికి వచ్చి ఎందుకు కలిసింది అంటూ రోజాని ఆయన అందంగా కడిగిపడేసిన విషయం తెలిసిందే.

Roja Counter Attack on Pawan :

Minister Roja Counter Attack on Pawan Kalyan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs