శృతి హాసన్ చాలా రోజుల నుండి తన పర్సనల్ విషయాలను, బాయ్ ఫ్రెండ్ శాంతను విషయాలను సోషల్ మీడియా ద్వారా అభిమానుల ముందు ఉంచుతుంది. తనకున్న ఆరోగ్య సమస్యలని ఇలా ఏ విషయాన్నీ దాచుకోవడం లేదు. అయితే రీసెంట్ గా శృతి హాసన్ వీరసింహ రెడ్డి ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న తర్వాత ఆమె వైరల్ ఫీవర్ బారిన పడింది. దానితో అటు వీరసింహరెడ్డి ఇటు వాల్తేర్ వీరయ్య రెండు సినిమాల ప్రమోషన్స్ కి హాజరుకాలేకపోయింది. ఈ సంక్రాంతి స్పెషల్ గా శృతి హాసన్ నటించిన వీరసింహారెడ్డి-వాల్తేర్ వీరయ్యలు రిలీజ్ అయ్యాయి.
అదలా ఉంటే శృతుతి హాసన్ మానసిక సమస్యలతో సతమతమవుతూ.. ట్రీట్మెంట్ తీసుకుంటుంది అంటూ ఓ వెబ్ సైట్ లో ప్రముఖంగా ఓ వార్త ప్రచురితమవ్వగా అది కాస్తా వైరల్ అయ్యింది. దానితో శృతి హాసన్ కి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. తనకెలాంటి మానసిక వ్యాధి కానీ, సమస్యలు కానీ లేవని, కేవలం వైరల్ ఫీవర్ మాత్రమే వచ్చిందని, కానీ తనకి రాకూడని జబ్బేదో వచ్చినట్టుగా ప్రచారం చేస్తున్నారు, మానసిక రోగంతో ఇబ్బందిపడుతున్నాను అంటున్నారు, నా మెంటల్ కండిషన్ బాగానే ఉంది.. ముందు మీ మెంటల్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేయించుకోండి అంటూ శృతి హాసన్ సదరు వెబ్ సైట్ పై ఫైర్ అయ్యింది.
ఒకవేళ మీకు ఇలాంటి జబ్బులుంటే త్వరగా చికిత్స చేయించుకోండి కానీ.. ఇలాంటి పిచ్చిపిచ్చి వార్తలు మాత్రం రాయొద్దని వారిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.