పవన్ కళ్యాణ్ అంటే అభిమానం ఉన్నా జనసేనలోకి వెళితే ఏమవుతుందో అని చాలామంది మల్లగుల్లలు పడుతున్నారు. కానీ కొంతమంది తెగించి పవన్ వెంట నడవడానికి సిద్ధమయ్యారు. అందులో ఇప్పుడు మెగా అభిమాని హైపర్ ఆది కనిపిస్తున్నాడు. హైపర్ ఆది జబర్దస్త్ ద్వారా పాపులర్ అయ్యి.. ప్రస్తుతం సినిమాలకి మాటలు రాస్తూ, అలాగే వెండితెర మీద నటుడిగాను కొనసాగుతున్న హైపర్ ఆది సత్తా చాటుతున్నాడు. అయితే హైపర్ ఆదికి మెగా ఫ్యామిలీ అన్న చిరు, నాగబాబు, పవన్ కళ్యాణ్ అంటే ప్రాణం.
హైపర్ ఆది మెగా అభిమానాన్ని చాటుకుంటూ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేనలోకి వెళ్ళినట్టే కనిపిస్తుంది ప్రస్తుత వ్యవహారం. ఈరోజు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరపున తలపెట్టిన యువశక్తి సభకు పవన్ కల్యాణ్ వీరాభిమాని హైపర్ ఆది కూడా హాజరయ్యాడు. ఈ సభలో హైపర్ ఆది జనసేనాని పవన్ కళ్యాణ్ ని విమర్శించేవాళ్ళని తనదైన పంచ్ లతో చీల్చి చెండాడు. సభలో హైపర్ ఆది మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ వారాహి వాహనాన్ని, ఆయన యాత్రని అడ్డుకుంటారా.. ఆయనకి గనక తిక్కరేగితే పాద యాత్ర చేస్తారు.. అప్పుడు మీరు కాశీ యాత్రకి పోవాల్సిందే. పవన్ కల్యాణ్ జనాల పక్షాన ఉన్నాడు కాబట్టే జనసేనాని అయ్యాడు. పవన్ కళ్యాణ్ ని తిట్టడానికి ఓ ప్రత్యేక శాఖని ఏర్పాటు చేసుకోండి, శాఖల పరువు తీస్తున్నారంటూ ఆది తనదైన శైలిలో రెచ్చిపోయి ఆ సభలో మాట్లాడాడు.
అంతేకాకుండా పవన్ కళ్యాణ్ ని ఈ మధ్య ప్యాకేజీ స్టార్ అంటున్నారు, పవన్ కల్యాణ్ అనే వ్యక్తి ప్రేమకు లొంగుతాడే తప్ప, ప్యాకేజీకి కాదురా, దత్తపుత్రుడు.. దత్తపుత్రుడు అంటూ గొంతు చించుకుంటున్నారు కానీ.. అదే నోటితో అంజనీ పుత్రుడు అనిపించుకుంటారు. మీరు పాపులర్ అవ్వాలని పవన్ కళ్యాణ్ ని అన్నారంటే.. ఈసారి ఎన్నికల్లో జనసేనాని కొట్టే దెబ్బకి మీ అబ్బ గుర్తుకు వస్తాడు అంటూ హైపర్ ఆది రెచ్చిపోయి మాట్లాడాడు. మీరేమో వ్యాపారాలు చేసుకుంటూ రాజకీయం చెయ్యొచ్చు, వ్యాపారాలు లేని ఆయన సినిమాలు చేసుకుంటూ రాజకీయం చేయకూడదా.. అంటూ పవన్ కళ్యాణ్ ని తిట్టే ప్రతి ఒక్కరిని ఉద్దేశించి హైపర్ ఆది వారికి వార్నింగ్ లాంటిది పడేసాడు. మరి ఈ లెక్కన హైపర్ ఆది జనసేనలోకి చేరిపోయినట్లే అనిపిస్తుంది.