2023 సంక్రాంతికి బాక్సాఫీసు హడావిడి మొదలైపోయింది. సంక్రాంతి పందెం కోళ్లు రెడీ అయినట్టుగా కోలీవుడ్ నుండి, టాలీవుడ్ నుండి సినిమాలు పోటీపడుతున్నాయి. యూత్ అంతా కోడిపందేల మోజులో ఉంటే.. హీరోలు మాత్రం సినిమాలపై హైప్ క్రియేట్ చేస్తూ ప్రమోషనల్ ఈవెంట్స్ తో హడావిడి మొదలు పెట్టారు. ప్రస్తుతం పల్లెటూర్లలో కోడి పందెలతో సంక్రాంతి ముగ్గులతో ఇళ్లన్నీ కళకళలాడుతుంటే.. సినిమా ఇండస్ట్రీ మొత్తం మూవీ మ్యానియాతో ఊగిపోతోంది. ఈ సంక్రాంతికి ఇప్పటికే అజిత్ తెగింపు ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. కోలీవుడ్, టాలీవుడ్ లో విడుదలైన తెగింపుకి సో సో టాక్ వచ్చేసింది. సో దాన్ని తెలుగు ప్రేక్షకులు పక్కనబెట్టేసి బాలయ్య వీర సింహారెడ్డి కోసం తయారైపోయారు.
నేడు గురువారం బాలకృష్ణ వీరసింహారెడ్డి గా ఆడియన్స్ ముందుకు వచ్చేసారు. గోపీచంద్ మలినేనితో కలిసి బాలయ్య మాస్ జాతర షురూ చేసారు. ప్రస్తుతం వీరసింహారెడ్డికి మిక్స్డ్ టాక్ వస్తుంది. ఇక తమిళంలో వారిసు నిన్న బుధవారమే విడుదలైనా.. శనివారం భోగి స్పెషల్ గా తెలుగు రాష్ట్రాల్లో విడుదల కాబోతుంది. ఇక రేపు మరో మాస్ జాతరకు తెలుగు ఆడియన్స్ రెడీ అవుతున్నారు. మెగాస్టార్ వాల్తేర్ వీరయ్య రేపు శుక్రవారం విడుదలకి రెడీ అయ్యింది. అప్పుడే యుఎస్ ప్రీమియర్స్ అంటూ హంగామా షురూ చేసారు అభిమానులు.
ఇక వీరసింహారెడ్డి కూడా విడుదలయ్యేసరికి.. ఇప్పుడు అందరి చూపు రేపు విడుదల కాబోతున్న వాల్తేర్ వీరయ్యపై పడింది. ఒకవేళ వీరసింహారెడ్డి కన్నా కొద్దిగా బెటర్ గా అనిపించినా వాల్తేర్ వీరయ్య ఈ సంక్రాంతి విన్నర్ గా నిలవడం ఖాయం. ఎలాగూ వారసుడికి తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి టాక్ వస్తుందో.. ట్రైలర్ తో పాటుగా, వారిసు రివ్యూస్ డిసైడ్ చేసేస్తాయి. సో ఫైనల్ గా ఈ సంక్రాంతి విన్నర్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు వెయిటింగ్.