గత ఏడాది క్రిస్టమస్ స్పెషల్ గా ఆడియన్స్ ముందుకు వచ్చిన రవితేజ-శ్రీలీల ధమాకా టాక్ తో సంబంధమే లేకుండా కలెక్షన్స్ మోత మోగించేసింది. ధమాకా థియేటర్స్ లో టపాసులా పేలడమేమిటి.. అందులో హీరోయిన్ గా నటించిన శ్రీలీల డాన్స్, ఆమె లుక్స్ కి మాస్ ఆడియన్స్ కి పిచ్చెక్కించేసింది. రవితేజ ఎనర్జిటిక్ పెరఫార్మెన్స్ కి సరితూగే శ్రీలీల ఎనర్జిటిక్ పెరఫార్మెన్స్ గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునేలా చేసింది. శ్రీలీల కోసమే ధమాకాని వీక్షించిన ప్రేక్షకులు ఉన్నారంటే నమ్మాలి.
ధమాకా విడుదలైన మొదటి రోజు సినిమాకి పాజిటివ్ టాక్ అయితే రాలేదు. రవితేజ, శ్రీలీల నటన, సాంగ్స్, మ్యూజిక్ తప్ప మారేది బాలేదు, రొటీన్ రొట్ట కొట్టుడు అంటూ తీసిపారేసిన ఆడియన్స్ కి క్రిటిక్స్ కి ధమాకా కలెక్షన్స్ షాకిచ్చాయి. రోజురోజుకి ధమాకా నెంబర్లు పెరిగిపోయి రెండువారాలు తిరిగేలోపు 100 కోట్ల మార్క్ తో ధమాకా 100 క్రోర్స్ సెలెబ్రేషన్స్ అంటూ చిత్ర బృందం హడావిడి చేసింది.
థియేటర్స్ లో మోత మోగిన ధమాకా ఓటిటి రిలీజ్ పై ఫ్యామిలీ ఆడియన్స్ కన్ను పడింది. అయితే ధమాకా ఓటిటి రైట్స్ ని దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్ వారు ఈ నెల 22 న ఓటిటి లో స్ట్రీమింగ్ చేసే ప్లాన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి సంక్రాంతి సినిమాల హడావిడి ముగియగానే జనవరి 22 నుండి ధమాకా ఓటిటి హడావిడి మొదలు కాబోతుంది. ఈ డేట్ పై నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటన ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తుంది.