Advertisement
Google Ads BL

జబర్దస్త్ కమెడియన్ కి కిర్రాక్ ఆర్పీ సహాయం


జబర్దస్త్ లో పేరు తెచ్చుకుని అక్కడ నుండి బయటకి వచ్చాక జబర్దస్త్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ హైలెట్ అయిన కిర్రాక్ ఆర్పీ ఇప్పుడు చెపలపులుసు ఆర్పీగా మారిపోయాడు. కూకట్ పల్లి లో నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రీ పాయింట్ తో తెగ ఫెమస్ అయిన ఆర్పీ.. మధ్యలో ఓ వారం షాప్ మూసేసి మళ్ళీ దాన్ని రెన్యువేట్ చేయించి అలాగే కిచెన్ కూడా పెంచి గ్రాండ్ గా మొదలు పెటాట్డు. చాలా తక్కువ రోజుల్లోనే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు హైదరాబాద్ లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆర్పీని యూట్యూబ్ ఛానల్స్ రీ ఓపెనింగ్ ఇంటర్వూస్ చేస్తున్నాయి.

Advertisement
CJ Advs

ఆ ఇంటర్వ్యూలోనే ఆర్పీ పంచ్ ప్రసాద్ కి కిడ్నీ ఆపరేషన్ చేయించబోతున్నట్టుగా చెప్పాడు. సదరు యాంకర్ జబర్దస్థ్ ప్రసాద్ కి పెద్ద మొత్తంలో సహాయం చేయబోతున్నారని తెలిసింది నిజమేనా అనగానే.. చేసే పని చెప్పుకోకూడదు, ప్రస్తుతం ప్రసాద్ పరిస్థితి బాగోలేదు, అతని ఆరోగ్యం దెబ్బతిన్నది, ప్రోగ్రామ్స్ కూడా చెయ్యడం లేదు. బయటికి కనిపించేంత సంతోషముగా ప్రసాద్ లేడు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చేపల పులుసు ఇచ్చాను, అతని ఆపరేషన్ కి సహాయం చేయాలనుకుంటున్నాను, అతనికి ఇప్పుడు చాలా అవసరం ఉంది.. అందుకే ఇలా అంటూ ఆర్పీ చెప్పాడు.

దానితో ఆర్పీని లైక్ చెయ్యని వారు కూడా ఆర్పీ అన్నా నువ్ సూపర్ అన్నా.. నువ్వు కష్టం విలువ తెలిసినవాడివి కాబట్టి అలా మాట్లాడుతున్నావ్ అంటూ ఆర్పీని ఆకాశానికెత్తేస్తున్నారు.

Kiraak RP help to Jabardasth comedian Prasad:

Kiraak RP interview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs