‘ఆర్ఆర్ఆర్’ చిత్రం చరిత్ర సృష్టించింది. ప్రపంచ చలనచిత్ర రంగంలో ఆస్కార్ తర్వాత లభించే అత్యుత్తమ అవార్డ్‌గా భావించే ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డును ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం సొంతం చేసుకుని.. తెలుగు సినిమా స్థాయి ఏంటో మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంలోని ‘నాటు నాటు’ పాటకు ఈ పురస్కారం వరించింది.
బుధవారం కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్‌లో జరిగిన ఈ అవార్డుల మహోత్సవంలో ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌కు సంబంధించి రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, కీరవాణి, కార్తికేయ వారివారి కుటుంబాలతో సహా హాజరై సందడి చేశారు. స్టేజ్‌పై ఈ అవార్డ్‌ను అనౌన్స్ చేయగానే టీమ్ అంతా నిలబడి క్లాప్స్‌తో హోరెత్తించారు. ఈ వీడియో ‘ఆర్ఆర్ఆర్’ నిర్మాణ సంస్థ డివివి ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ట్విట్టర్‌లో షేర్ చేసింది.
ఈ వీడియో లైక్స్, కామెంట్స్‌తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఈ ఘనత సాధించిన ఆర్ఆర్ఆర్ టీమ్‌పై ఇండియా వైడ్‌గా ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రముఖులందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్.రెహమాన్ కూడా ట్విట్టర్ వేదికగా కీరవాణికి అభినందనలు తెలియజేశారు. మొత్తంగా ఈ అవార్డ్‌తో టాలీవుడ్‌లో ఓ పండగ వాతావరణం నెలకొంది.