Advertisement
Google Ads BL

సమంత లో ఫైర్ తగ్గలేదు


సమంత మాయోసైటిస్ వ్యాధితో బాధపడుతూ గత ఆరు నెలలుగా పబ్లిక్ లోకి రావడం లేదు. ఆమె నటించిన యశోద సినిమా ప్రమోషన్స్ కోసం సుమకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చినా అందులో సమంత చాలా నీరసంగా అన్ ఈజీగా కనిపించింది. ఇక తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి సమంత పాన్ ఇండియా ఫిలిం శాకుంతలం మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సమంత సారి లో కనిపించింది. కానీ ఆమెలో మునుపటి గ్లో కానీ, సంతోషం కానీ, ఆమె యాక్టీవ్ నెస్ కనిపించలేదు. ఇంకా ఆమె ఆరోగ్యం కుదుటపడలేదు అనేది మాత్రం అర్ధమవుతుంది.

Advertisement
CJ Advs

శాకుంతలం ఈవెంట్ లో సమంత మాట్లాడానికి, అలాగే ఫొటోలకి ఫోజులివ్వడానికి కాస్త ఇబ్బందిపడినట్లుగా అనిపించింది. అయితే ఆ ఈవెంట్ లోను, మొన్నామధ్యన ఎయిర్ పోర్ట్ లో సమంత లుక్ చూసిన కొంతమంది సమంతపై నెగెటివ్ గా స్పందించారు. సమంతలో ఇదివరకటి అందం మిస్ అయ్యింది, నాగ చైతన్య తో విడాకుల విషయం, అలాగే మాయోసైటిస్ వ్యాధి ఆమెని బాగా కృంగదీశాయంటూ నెగెటివ్ మాట్లాడం చూసిన సమంత మునుపుటిలా ఫైర్ అయ్యింది. నా లాగా కొన్నినెలల పాటు చికిత్స తీసుకునే పరిస్థితి మీకు ఎపప్టికి రాకూడదని కోరుకుంటున్నాను. మీ అందం మరింత పెరిగేలా నా ప్రేమను కొంచెం పంపిస్తున్నా అంటూ కౌంటర్ వేసింది.

సమంత మళ్ళీ మాములుగా మారాలంటే ఇలా ఈవెంట్స్ లోను, షూటింగ్స్ లో పాల్గొనాలి, అప్పుడే ఆమె మళ్ళీ ఎప్పటిలాగా యాక్టీవ్ గా అందంగా మారుతుంది, వ్యాధితో  పోరాటం చేస్తున్నవారికి చేయూత ఇవ్వడం పోయి.. ఇలా నెగెటివ్ కామెంట్స్ చేస్తూ బాధపెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కొంతమంది సమంతని సపోర్ట్ చేస్తున్నారు.

Samantha unmoved by insensitive post:

Samantha reacts to insensitive post
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs