గత సీజన్ లో సిరి, ఈ సీజన్ లో శ్రీహన్ లు బిగ్ బాస్ లో సందడి చేసారు. సిరి-శ్రీహన్ ఇద్దరు ప్రేమికులు. బిగ్ బాస్ హౌస్ లో సిరి షణ్ముఖ్ తో చేసిన ఫ్రెండ్ షిప్ వలన శ్రీహన్ తో సిరికి బ్రేకప్ అయ్యినంతపని పని అయ్యింది. షణ్ముఖ్-సిరి ల మితిమీరిన ఫ్రెండ్ షిప్ వలన అటు షణ్ముఖ్, ఇటు సిరిలు ఇద్దరూ పర్సనల్ గా సఫర్ అయ్యారు. ఈ సీజన్ లో శ్రీహన్ - శ్రీసత్య ల ఫ్రెండ్ షిప్ కూడా హైలెట్ అయినా.. మధ్యలో రేవంత్ ఉండడంతో శ్రీహన్ బయటపడ్డాడు. ఇక విన్నర్ అవ్వాల్సిన శ్రీహన్ 40 లక్షల సూట్ కేట్ కోసం టైటిల్ వదులుకున్నాడు.
సిరి-శ్రీహన్ ఇద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే న్యూస్ నడుస్తుంది. కొన్నాళ్లుగా కలిసి ఉంటున్న సిరి-శ్రీహన్ లు ఓ బాబుని పెంచుకుంటున్నారు. అయితే తాజాగా సిరి సోషల్ మీడియాలో ఫాన్స్ తో చిట్ చాట్ చేసింది. చాలామంది సిరిని శ్రీహన్ తో పెళ్ళెప్పుడు అని అడిగారు. దానికి త్వరలోనే చేసుకుంటామని ఆన్సర్ ఇచ్చింది సిరి. తొందరలోనే శ్రీహన్ తో ఏడడుగులు నడవడానికి రెడీ అవుతున్నట్టుగా సిరి చెప్పడంతో సిరి-శ్రీహన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.