Advertisement
Google Ads BL

ప్రమాదం నుండి బయటపడ్డ నభా నటేష్


ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో గ్లామర్ తో తన నటన తో టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకున్న నభా నటేష్ ఆ తర్వాత మరే చిత్రంలో కనిపించకపోవడంతో, ఇంత బ్యూటిఫుల్ గర్ల్ కి గ్లామర్ గర్ల్ కి అవకాశాలు రాలేదేమో అనుకున్నారు, లేదంటే ఆమె వేరే కారణాలతో సినిమాలకి గ్యాప్ ఇచ్చిందేమో అని ఆమె అభిమానులు అపోహ పడ్డారు.

Advertisement
CJ Advs

అయితే నభా నటేష్.. వెంట వెంటనే చిత్రాలు చేస్తున్న సమయంలో తను ఇలా బ్రేక్ తీసుకోవడానికి కారణం లేకపోలేదు. ఆ విషయాన్నే నభా తన ఇన్స్టా ద్వారా ఫుల్ క్లారిటీ చ్చింది.

గడిచిన సంవత్సరం చాలా కష్టంగా సాగిపోయింది, నాకొక ప్రమాదం జరిగింది, అప్పుడే నా ఎడమ భుజానికి తీవ్ర గాయమై క్లిష్టమైన సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది. అని తన ఇంస్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా తెలిపింది. చికిత్సలో భాగంగా తను తీవ్రమైన శారీరక, మానసిక బాధని ఎదురుకున్నట్టు చెబుతూ తను మళ్ళీ నటించడం మొదలుపెడతానని, తిరిగి చిత్రాలు చేస్తానని చెప్పుకొచ్చింది ఈ యువ నటి.

అలా తీవ్ర గాయాల పాలై తిరిగి కోలుకోవడమే కాక మళ్ళీ తనకి వచ్చిన, నచ్చిన పనిని నభా నటేష్ మొదలు పెట్టబోతోంది.

Nabha Natesh Suffered A Bad Accident:

Nabha Natesh Suffered A Bad Accident, Multiple Surgeries 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs