Advertisement
Google Ads BL

ఈ క్ష‌ణం కోస‌మే ఎదురుచూస్తున్నా: సమంత


చాలా రోజుల తర్వాత హీరోయిన్ సమంత తెలుగు మీడియా ముందుకు వచ్చింది. ఈ మధ్య ఆమో మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతోన్న విషయం తెలిసిందే. అయితే బాధతో ఉన్నప్పటికీ ఇంతకు ముందు చేసిన ‘యశోద’ చిత్రానికి, ఇప్పుడు చేసిన ‘శాకుంతలం’కు ఆమె తన వంతు ప్రమోషన్స్‌ని నిర్వహిస్తోంది. ‘యశోద’ చిత్రం భారీ సక్సెస్ తర్వాత వస్తున్న ‘శాకుంతలం’ చిత్రంపై అంతే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఇండియ‌న్ స్క్రీన్‌పై ఇప్ప‌టి వ‌ర‌కు రాని విధంగా భారీ బ‌డ్జెట్‌తో ప్ర‌తిష్టాత్మ‌కంగా గుణ‌శేఖ‌ర్ రూపొందిస్తున్నారు. స్టార్ ప్రొడ్యూస‌ర్ దిల్ రాజు స‌మ‌ర్ప‌ణ‌లో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సమంత మాట్లాడుతూ..

Advertisement
CJ Advs

‘‘ఈ క్ష‌ణం కోస‌మే నేను, శాకుంత‌లం టీమ్ ఎదురు చూస్తున్నాం. ఎలాగైనా ఈ వేడుకకు రావాల‌ని ఫిక్సై బ‌లం తెచ్చుకుని వ‌చ్చాను. గుణ శేఖ‌ర్‌గారిపై ఉన్న రెస్పెక్ట్, అభిమానం వ‌ల్ల వ‌చ్చాను. ఆయ‌న‌కు సినిమానే జీవితం. ప్ర‌తి సినిమాను ప్రాణం పెట్టి తీస్తారు. ఈ సినిమాను కూడా అలాగే తీశారు. కథ విన్న‌ప్పుడూ యాక్ట‌ర్స్ అంద‌రూ సినిమా అలాగే రావాల‌ని కోరుకుంటారు. కొన్నిసార్లు మాత్ర‌మే మా ఊహ‌ను దాటి ఎక్స్‌ట్రా మ్యాజిక్ జ‌రుగుతుంది. ఈ సినిమా చూసిన త‌ర్వాత నేను అదే ఫీల్ అయ్యాను. నేను ఊహించిన దాని కంటే సినిమా ఎన్నో రెట్లు బావుంది. సినిమా చూసిన తర్వాత గుణశేఖ‌ర్‌గారి పాదాల‌పై ప‌డి థాంక్యూ చెప్పాను. దిల్ రాజుగారికి థాంక్యూ. మంచి సినిమా తీయాల‌నే ఆయ‌న చూస్తారు. 

ఈ సినిమాలో చాలా మంది సీనియ‌ర్ న‌టీన‌టులున్నారు. నేను సెట్స్‌లోకి రెడీ అయ్యి అడుగు పెట్టిన త‌ర్వాత అక్క‌డున్న అమ్మాయిల రియాక్ష‌న్ చూసి ప‌ర్ఫెక్ట్ దుష్యంతుడు దొరికాడ‌ని ఫిక్స్ అయ్యాను. కాళిదాసుగారు 5వ శ‌తాబ్దంలో రాసిన అభిజ్ఞాన శాకుంత‌లం ఆధారంగాచేస్తోన్న శాకుంత‌లం సినిమా కోసం న‌న్ను గుణ శేఖర్‌గారు ఎంపిక చేయ‌టం నా అదృష్టం. నేను జీవితంలో ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొన్నాను. అయితే నాలో ఎప్పటికీ మారనిది ఒక‌టే ఉంది. అదే సినిమాను నేను ఎంత ప్రేమిస్తాను.. సినిమా న‌న్ను ఎంత ప్రేమిస్తుంద‌నే విష‌యం. శాకుంత‌లంతో ఈ ప్రేమ మ‌రింత పెరుగుతుంద‌ని న‌మ్ముతున్నాను’’ అన్నారు.

Samantha Speech at Shaakuntalam Trailer Release:

Samantha Happy with Shaakuntalam Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs