Advertisement
Google Ads BL

‘వీరసింహారెడ్డి’.. సెన్సార్ టాక్ ఏంటంటే?


నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి బరిలో దిగుతోన్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్.. ఇలా ప్రతి ఒక్కటీ బీభత్సమైన స్పందనను రాబట్టుకున్నాయి. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సంక్రాంతి బరిలోకి దిగేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమైంది.  

Advertisement
CJ Advs

 

సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి  యూ/ ఏ సర్టిఫికేట్‌ను జారీ చేసింది. బాలకృష్ణ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, గోపీచంద్ మలినేని టేకింగ్, సాయి మాధవ్ బుర్రా రాసిన ఇంటెన్స్ డైలాగ్స్, చార్ట్‌బస్టర్ ఆల్బమ్,  ఎస్ థమన్ స్కోర్ చేసిన బీజియం, హై-ఆక్టేన్ యాక్షన్ ఎపిసోడ్స్, సెకండాఫ్‌లోని ఎమోషనల్ పార్ట్ సినిమాకు హైలైట్‌‌గా నిలుస్తాయని.. సంక్రాంతికి కావాల్సిన అన్ని హంగులతో వస్తున్న ఈ సినిమాపై సెన్సార్ అధికారులు కూడా ప్రశంసలు కురిపించినట్లుగా తెలుస్తోంది.

 

కాగా.. బాలకృష్ణ సరసన శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో దునియా విజయ్, వరలక్ష్మి శరత్‌కుమార్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. చంద్రిక రవి ప్రత్యేక పాటలో సందడి చేయగా, హనీ రోజ్ మరో కీలక పాత్ర పోషించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలకాబోతోంది.

Veera Simha Reddy : Censor Formalities Completed:

Veera Simha Reddy Censor Report
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs