Advertisement
Google Ads BL

2 సినిమాలూ సక్సెస్ కావాలి: చిరంజీవి


ఇన్ని సంవత్సరాల, ఇన్ని దశాబ్ధాల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక నిర్మాత ఒకే సారి.. రెండు భారీ చిత్రాలను విడుదల చేయడం అనేది ఎప్పుడూ జరగలేదు. అది ఫస్ట్ టైమ్ జరుగుతుందని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఆయన హీరోగా నటించిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక వైజాగ్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ సినిమాని నిర్మించిన మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ గురించి చిరంజీవి మాట్లాడుతూ.. 

Advertisement
CJ Advs

‘‘మైత్రీ మూవీ మేకర్స్ గురించి చెప్పాలంటే.. నాకు రామ్ చరణ్ ‘రంగస్థలం’ సమయంలో ఈ బ్యానర్ గురించి చెప్పాడు. డాడీ.. వాళ్లు గొప్ప ప్రొడ్యూసర్స్. నీ పాత ప్రొడ్యూసర్స్‌తో నాకు పరిచయాలు ఉన్నాయి కదా.. అని కొంత మంది పేర్లు చెప్పి.. ఆ స్థాయి వాళ్లు అని చెప్పాడు. ఎంత బాగా చూసుకుంటారు.. ఎంతబాగా ప్రొడక్షన్ చేస్తారు.. నాకయితే మళ్లీ మళ్లీ వాళ్ల దగ్గర సినిమా చేయాలని ఉందని చెప్పాడు. నీ కమ్ బ్యాక్ సినిమాలలో ఒక సినిమాని వాళ్లతో చేయాలని చెప్పినప్పుడు.. ఖచ్చితంగా చేస్తానని చెప్పాను. అది ఇంత త్వరగా అవుతుందని అనుకోలేదు.. అయిపోయింది. నాకు తెలిసిన ప్రొడ్యూసర్స్ మహుమహులు ఉన్నారు. రామానాయుడుగారు, అశ్వనీదత్‌గారు, అల్లు అరవింద్‌గారు, కెఎస్ రామారావుగారు, దేవీప్రసాద్‌గారు.. ఇలాంటి గొప్ప నిర్మాతలు ఉన్నారే.. వాళ్ల స్థాయిలో నిలబడదగిన నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్‌గారు, రవిగారు, చెర్రీగారు. ఎందుకంటే.. ఈ సినిమా ఎంత ఖర్చవుతుందని వాళ్లు అడగలేదు. దేనికీ వెనకడుగు వేయలేదు. వాళ్లు చెప్పడం, సెట్స్ వేయించడం, విఎఫ్‌ఎక్స్ కోసం ఖర్చు పెట్టడం.. ఇవన్నీ కూడా మీరు చెప్పండి.. మేము చేస్తాం అన్నారు తప్ప.. ఏ రోజూ కూడా లెక్కలు చూసుకుని.. ఖర్చు ఎక్కువ అయిపోతుందని అనలేదు. అది డైరెక్టర్ మీద ఉన్న నమ్మకం. డైరెక్టర్ పెద్ద పెద్ద ఎపిసోడ్స్ అని చెబుతున్నారు. అవి సినిమాకి అవసరం. అయితే వాళ్లు ఒకటే చెబుతున్నారు.. మనం పెట్టే ప్రతి పైసా.. సినిమా స్ర్కీన్‌పైన కనిపించాలని. ఎస్.. ఈ సినిమాకి పెట్టిన ప్రతి పైసా.. స్ర్కీన్‌పైనే కనబడుతుంది. అది డైరెక్టర్ తీసుకున్న గొప్ప నిర్ణయం. ఫస్ట్ 25 మినిట్స్‌లోనే ఇది హాలీవుడ్ తరహా సినిమా అని అందరికీ అనిపిస్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే.. సినిమా మొత్తం చెప్పేసేలా ఉన్నాను. 

అలాంటి నిర్మాతలు వారు.. ఏ విషయంలోనూ వెనక్కి తగ్గరు. ఎంత మిగిలింది అని కాదు.. ఎంత గొప్ప సినిమా తీశామనే ప్యాషన్‌తో సినిమా తీస్తున్నారు. ఇంకా నేనే చెబుతుండేవాడిని.. చూసుకోండి. వరుస సినిమాలు తీస్తున్నారు. గతంలో కూడా ఇలా తీసి చాలా మంది నిర్మాతలు దెబ్బతిని ఉన్నారు. మీలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి చాలా అవసరం. జాగ్రత్తగా అడుగులు వేయండి. ఇండస్ట్రీ ముందుకు వెళ్లాలంటే మీలాంటి నిర్మాతలు బాగుండాలి. ఎప్పుడూ తొందరపాటు పనులు చేయవద్దు. సినిమా తర్వాత సినిమా చేయండి. కఠిన నిర్ణయాలు తీసుకోవద్దని వాళ్లకి చెబుతూనే ఉంటాను. ఎందుకంటే.. అలాంటి నిర్మాతలను నిలబెట్టుకోవడమనేది మనందరి బాధ్యత. మన ఇండస్ట్రీ బాధ్యత. వండర్‌ఫుల్ పీపుల్ వీళ్లందరూ. ఇక అనుకోకుండానో..లేక అనుకునో నాకు తెలియదు కానీ.. ఇన్ని సంవత్సరాల, ఇన్ని దశాబ్ధాల తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక నిర్మాత ఒకే రోజు.. రెండు భారీ చిత్రాలను విడుదల చేయడం అనేది ఎప్పుడూ జరగలేదు. అది ఫస్ట్ టైమ్ జరుగుతుంది. వీళ్లు ఖర్చుకి ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు.. రెండు సినిమాలను ఒకేసారి విడుదల చేయడానికి ఏ మాత్రం బెదరడం లేదు.. నెరవడం లేదు. ఏమై ఉంటుంది వీళ్ల ధైర్యం అంటే.. ఆ సబ్జెక్ట్స్ మీద వారికున్న కాన్ఫిడెన్స్. ఖచ్చితంగా ప్రేక్షకులు ఆ సినిమాలను ఆదరిస్తారనే నమ్మకం. వాళ్లు బాగుండాలి. వాళ్లు బాగుంటేనే పరిశ్రమ బాగుంటుంది. కాబట్టి రేపు సంక్రాంతికి విడుదలయ్యే ఈ రెండు సినిమాలు పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఈ వైజాగ్ సాక్షిగా నేను కోరుకుంటున్నాను. రెండు సినిమాలు వాళ్లకి రెండు కళ్లు. రెండు సినిమాలు పెద్ద విజయం సాధిస్తాయి. ఈ విజయంతో వచ్చే ప్రశంసల్ని ఫ్యూయల్‌లా తీసుకుని రాకెట్‌గా వాళ్లు దూసుకెళ్లాలని కోరుకుంటున్నాను. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద బౌత్ మూవీస్..’’ అని అన్నారు.

Chiranjeevi about Mythri Movie Makers:

Waltair Veerayya Pre Release Event Highlights
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs