Advertisement
Google Ads BL

చిరంజీవి వేడుకకు శ్రీదేవి డుమ్మా!


‘నువ్వు శ్రీదేవైతే.. నేనే చిరంజీవవుతా..’ ఇది ‘వాల్తేరు వీరయ్య’ పాటలోని లిరిక్. ఈ పాటలోని శ్రీదేవి ఎవరో కాదు శృతిహాసన్. ఈ సంక్రాంతికి విడుదలయ్యే రెండు భారీ సినిమాలలో ఆమెనే హీరోయిన్. చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రంలో, అలాగే.. బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘వీరసింహారెడ్డి’ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్‌గా నటించింది. అలాగే ఈ రెండు సినిమాలను నిర్మించింది మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరే. జనవరి 12న ‘వీరసింహారెడ్డి’, 13న ‘వాల్తేరు వీరయ్య’ థియేటర్లలోకి దిగబోతున్నారు. ప్రస్తుతం ఈ రెండు సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్‌ను మైత్రీ సంస్థ భారీగా నిర్వహిస్తోంది. 

Advertisement
CJ Advs

ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే ‘వీరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ వేడుకను ఒంగోలులో భారీగా నిర్వహించిన చిత్రయూనిట్.. ఆదివారం వైజాగ్‌లో ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ వేడుకను కూడా అదే తరహాలో నిర్వహిస్తోంది. అయితే ఈ వేడుకకు శృతిహాసన్ డుమ్మా కొడుతోంది. ‘వీరసింహారెడ్డి’ ఫంక్షన్‌లో యమా యాక్టివ్‌గా కనిపించిన శృతి.. ఆ వేదికపై డ్యాన్స్ కూడా చేసింది. కానీ ‘వీరయ్య’ ఫంక్షన్‌కి వచ్చే సరికి ఆరోగ్యం బాగా లేదంటూ ఓ మెసేజ్‌ని విడుదల చేసింది. దీంతో చిరంజీవి వేడుకకు శ్రీదేవి రావడం లేదంటూ.. సోషల్ మీడియా వేదికగా ఒకటే కామెంట్స్. 

‘‘హెల్త్ సరిగా లేకపోవడంతో ‘వాల్తేరు వీరయ్య’ ప్రీ రిలీజ్ వేడుకకు హాజరు కాలేకపోతున్నాను. ఈ ఈవెంట్‌ను మిస్ అవుతున్నందుకు ఎంతగానో బాధపడుతున్నాను. మెగాస్టార్ చిరంజీవిగారి సరసన ఈ సినిమాలో నటించినందుకు ఎంతగానో గర్వపడుతున్నాను. సినిమా బ్రహ్మాండమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రీ రిలీజ్ వేడుకను మిస్ అవుతున్నందుకు చాలా విచారిస్తున్నాను..’’ అని శృతిహాసన్ తన ఇన్‌స్టా స్టేటస్‌లో పోస్ట్ చేసింది.    

Shruti Haasan disappoints Veerayya:

Shruti Haasan to miss Waltair Veerayya Pre Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs