Advertisement
Google Ads BL

అయ్యబాబోయ్.. శ్రీలీలలో అపరిచితుడు!


‘పెళ్లిసందD’ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమైన శ్రీలీల.. ఆ చిత్రంతో హిట్ అందుకోలేకపోయినప్పటికీ.. వెంటనే మాస్ మహారాజా రవితేజ చిత్రంలో ఛాన్స్ కొట్టేసి.. అందరి కళ్లు తనపై పడేలా చేసుకుంది. రవితేజ సరసన ‘ధమాకా’ చిత్రంలో నటించిన ఈ బ్యూటీ.. ఆ చిత్రంతో హిట్ అందుకోవడమే కాకుండా.. పనిలో పనిగా వందకోట్ల క్లబ్‌ సినిమాల లిస్ట్‌లోకి కూడా చేరిపోయింది. ‘ధమాకా’ చిత్రం ఊహించని కలెక్షన్స్ రాబడుతూ.. బాక్సాఫీస్ వద్ద 100 కోట్లను రీచ్ అయింది. ఈ సినిమా సక్సెస్‌లో శ్రీలీలకి కూడా క్రెడిట్ దక్కుతుంది. ముఖ్యంగా డ్యాన్స్‌‌తో ఆమె అందరినీ ఫిదా చేసింది. ‘ధమాకా’ మూడ్‌లో ఉన్న శ్రీలీల తనలో ఉన్న ఓ క్వాలిటీని తాజా ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. శ్రీలీలకి కోపం చాలా ఎక్కువట.. ఎందుకూ అని అడిగితే.. ఏం సమాధానం చెప్పిందో తెలుసా?

Advertisement
CJ Advs

‘‘అవును నాకు కోపం ఎక్కువే.. కానీ ఆ తప్పు నాది కాదు.. నా ముక్కుది. పొడవు ముక్కున్న వాళ్లకు కోపం ఎక్కువట కదా? నాకూ అంతే. కోపం వస్తే.. ఆ సమయంలో నన్ను అపరిచితుడు ఆవహిస్తాడు. కోపంగా ఉన్నప్పుడు అందరిమీద కేకలు వేసేస్తా. నాకు కోపం వస్తే.. ముఖ్యంగా బలయ్యేది.. బుక్కయ్యేది మా అమ్మే. కానీ.. అది కాసేపే. నా కోపం పోగానే.. ‘అమ్మా.. నిన్ను అన్ని మాటలు అన్నానా? నన్ను క్షమించు’ అని చిన్నపిల్లలా ఏడ్చేస్తాను. నాలో ఉన్న ఈ వేరియేషన్స్‌ చూసి అమ్మ ఆశ్చర్యపోతుంటుంది. ‘ఏంటే... అపరిచితురాలిలా మారిపోతున్నావ్‌..’ అని ఏడిపిస్తుంది. నా కోపాన్ని మా అమ్మ కాబట్టి భరిస్తోంది కానీ.. ఇంకొకరికైతే మెంటల్‌ వచ్చేసేది. నన్ను ఎప్పుడో బయటికి తోలేసేవారు’’ అని శ్రీలీల చెప్పుకొచ్చింది. 

కాగా. ప్రస్తుతం ఆమె వైష్ణవ్ తేజ్ సరసన ఓ చిత్రంలోనూ, బాలయ్య-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రంలోనూ, రామ్-బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రంలోనూ నటిస్తోంది. ఇవికాక మరో రెండు, మూడు ప్రాజెక్ట్‌లు ఆమె చేతిలో ఉన్నాయి.

Aparichitudu in Heroine Sreeleela:

Aparichithudu Disturbing Sreeleela
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs