Advertisement
Google Ads BL

సంక్రాంతి సినిమాకి క్లీన్ ‘యు’ సర్టిఫికేట్


ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, తుణివు వంటి నాలుగు భారీ చిత్రాల మధ్య ఓ ప్లెజంట్ స్మాల్ మూవీగా ‘కళ్యాణం కమనీయం’ రిలీజ్ అవుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన మోషన్ పోస్టర్, ఓ మనసా, హో ఎగిరే లిరికల్ సాంగ్స్ మంచి ఆదరణ పొందాయి. కంటెంట్ ఓరియెంటెడ్ మూవీ కావడం, ఫ్యామిలీ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే కాన్సెప్ట్‌తో రూపొందడంతో ఈ సినిమా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. సకుటుంబంగా థియేటర్‌కు వెళ్లి ఎంజాయ్ చేసే మూవీ అనే అభిప్రాయం ట్రైలర్‌తో ఏర్పరచుకున్న ఈ చిత్రానికి సెన్సార్ కూడా అదే సర్టిఫికేట్‌‌ను జారీ చేసింది. తాజాగా చిత్ర సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ వారు ఈ చిత్రానికి క్లీన్ యు సర్టిఫికెట్ జారీ చేశారు. సకుటుంబంగా చూసే ఆహ్లాదకర చిత్రమని సెన్సార్ బృందం ఈ చిత్రయూనిట్‌కు అభినందనలను తెలియజేసినట్లుగా తెలుస్తోంది.

Advertisement
CJ Advs

యువ హీరో సంతోష్ శోభన్ నటిస్తున్న కొత్త సినిమా ‘కళ్యాణం కమనీయం’. ఈ సినిమాతో కోలీవుడ్ తార ప్రియ భవానీ శంకర్ టాలీవుడ్‌కి పరిచయమవుతోంది. ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మిస్తోంది. పెళ్లి నేపథ్యంతో సాగే ఆహ్లాదకర కథతో నూతన దర్శకుడు అనిల్ కుమార్ ఆళ్ల రూపొందిస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న  ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

సంక్రాంతి బరిలో ఉన్న పెద్ద సినిమాలు నాలుగు మాస్ యాక్షన్‌తో నిండి ఉండటంతో.. ఆ నాలుగింటి మధ్య ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం గుర్తింపు పొందుతుందని, తప్పకుండా ఈ చిత్రం ప్రేక్షకులని ఆకర్షించి, పెద్ద విజయం సాధిస్తుందని చిత్రయూనిట్ భావిస్తోంది. 

Kalyanam Kamaneeyam censor details out:

Clean U to Kalyanam Kamaneeyam Movie From Censor
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs