Advertisement
Google Ads BL

దర్శకుడు సురేందర్‌ రెడ్డికి యాక్సిడెంట్


‘కిక్’, ‘ధృవ’, ‘సైరా’ వంటి చిత్రాలతో స్టార్ దర్శకుడిగా గుర్తింపు పొందిన సురేందర్ రెడ్డి.. ప్రస్తుతం అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేనితో ‘ఏజెంట్’ అనే చిత్రం చేస్తున్నారు. ఎప్పుడో మొదలైన ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. వాస్తవానికి ఇప్పటికే రెండు, మూడు సార్లు విడుదల తేదీని ప్రకటించారు. కానీ ఇంకా షూటింగ్ జరుగుతున్నట్లుగా తాజాగా ‘ఏజెంట్’ సెట్స్‌లో జరిగిన ఓ ప్రమాదంతో తెలుస్తుంది. ‘ఏజెంట్’ షూటింగ్‌లో దర్శకుడు సురేందర్ రెడ్డికి యాక్సిడెంట్ జరిగింది. ఒక ఇనుప కడ్డీ కాలికి తగలడంతో ఆయన ఎడమ కాలికి గాయం అయినట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది. 

Advertisement
CJ Advs

‘ఏజెంట్’ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ప్యాచ్ వర్క్ జరుగుతోంది. ఈ షూటింగ్‌లో.. ఒక బలమైన ఇనుప కడ్డీ అతని తలకి తగలబోతుండగా.. వెంటనే అలెర్ట్ అయినప్పటికీ సురేందర్ రెడ్డి ఈ ప్రమాదం నుంచి తప్పించుకోలేకపోయారని, తృటిలో ఆయన పెద్ద ప్రమాదాన్ని తప్పించుకున్నారని తెలుస్తుంది. కాలితో పోయింది కానీ.. తలకి తగిలి ఉంటే.. పరిస్థితి వేరేలా ఉండేదని చిత్రయూనిట్ పేర్కొంది. గాయమైన వెంటనే ఆయనని దగ్గరలోని హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందించడంతో.. ప్రస్తుతం ఆయన కోలుకున్నారని.. భయపడాల్సిన అవసరం ఏమీ లేదని డాక్టర్లు చెప్పినట్లుగా తెలుస్తోంది. 

అయితే డాక్టర్లు కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని చెప్పినప్పటికీ.. సురేందర్ రెడ్డి మాత్రం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తుంది. త్వరలోనే ఈ చిత్రం విడుదల ఉండటంతో.. ఎట్టి పరిస్థితులలోనూ పనులు ఆగకూడదనే దృఢనిశ్చయంతో సురేందర్ రెడ్డి ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నట్లుగా సమాచారం. కాగా, అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు.  

Director Surender Reddy Injured in Agent Film Shooting:

Accident In Agent Movie Shooting
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs