Advertisement
Google Ads BL

బాబీ.. యు ఆర్ ఏ ట్రూ మెగా ఫ్యాన్!


మెగాస్టార్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. సినిమాలైతే చేస్తున్నారు కానీ.. అందులో ఏదో మిస్ అవుతుందనేది ఆయన అభిమానుల ఆవేదన. అదేంటో.. ప్రేక్షకుల కంటే కూడా మెగా ఫ్యాన్స్‌కి బాగా తెలుసు. డైరెక్టర్ బాబీ అందులో ఓ డిగ్రీ ఎక్కువే చేసిన అభిమాని కావడంతో.. ‘గబ్బర్‌సింగ్’తో హరీష్ శంకర్ అభిమానం పవర్ చూపిస్తే.. ఇప్పుడు బాబీ వంతొచ్చింది. మెగాస్టార్ చిరంజీవికి బాబీనే కాదు.. వాళ్ల నాన్న కూడా వీరాభిమాని. ఆ విషయం మెగాస్టార్ చిరంజీవే స్వయంగా వెల్లడించారు. ప్రస్తుతం బాబీ వాళ్ల నాన్న ఈ లోకంలో లేడు కానీ.. ఉండి ఉంటేనే పుత్రోత్సాహం అనుభవించేవారు. తన కొడుకు తను ఎంతగానో అభిమానించే హీరోని డైరెక్ట్ చేసిన సినిమా చూడలేదనే కానీ.. మిగతా ఆనందం మొత్తం బాబీ తన తండ్రికి అందించాడు. 

Advertisement
CJ Advs

ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని కలిసి, ఆయనతో కాసేపు స్పెండ్ చేయడం.. నిజంగా ఓ ట్రూ అభిమానికి ఇంతకంటే ఏం కావాలి? అది బాబీ తన తండ్రికి అందించాడు. అలాగే రేపు రాబోయే ‘వాల్తేరు వీరయ్య’తో ఒక ట్రూ మెగా అభిమానిగా.. మెగాస్టార్‌ని అభిమానించే వారందరీ కళ్లలో ఆనందం తీసుకురాబోతున్నాడు. ఒక్క ట్రైలర్‌కే ఇంత అవసరమా? అని అందరికీ అనిపించవచ్చు. అంటారుగా.. అన్నం ఉడికిందీ లేనిది.. ఒక్క మెతుకుతో చెప్పవచ్చు అని. అలాగే ‘వాల్తేరు వీరయ్య’ ట్రైలర్ తెచ్చిన వైబ్రేషన్ కూడా ఒక్క మెతుకు వంటిదే. ‘వింటేజ్ చిరంజీవి’ అనే పదం ఈ మధ్య ఎక్కువగా వినబడుతుంది.. ట్రైలర్‌లో అది కనబడుతుంది. సరైన కంటెంట్ దొరికితే.. అందునా తనకి బలమైన జానర్ పడితే.. మెగాస్టార్ ఏ రేంజ్‌లో చెలరేగుతాడో.. ఇప్పటికే ఎన్నో సినిమాలలో చూశాం. ఇప్పుడు మరోసారి చూడబోతున్నాం. ట్రైలర్ విడుదల తర్వాత.. మెగాభిమానులందరూ అనుకుంటున్నది ఇదే. అంతేకాదు.. ఆ వింటేజ్ చిరుని మళ్లీ వెనక్కి తీసుకువచ్చిన బాబీకి మనసులోనే ‘యు ఆర్ ఏ ట్రూ మెగా ఫ్యాన్’ అంటూ అభినందనలు తెలుపుకుంటున్నారు. 

రేపు సినిమా విడుదలైన తర్వాత.. బాబీకి గుడి కూడా కట్టేస్తారేమో.. ఏమో చెప్పలేం. రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా సరే.. స్క్రీన్‌పై చిరుని ఇలా చూసి మాత్రం చాలా కాలం అవుతుంది. అలాగే సినిమాలో దమ్ముందనేలా ట్రైలర్ కూడా కుమ్మేసింది. మరో వైపు మాస్ రాజా కూడా తగ్గేదేలే అన్నట్లుగా విజృంభించేశాడు. మెగా, మాస్‌లతో బాబీ ఆడించిన ఆట.. దేవిశ్రీ మోగించిన మోత.. రేపు థియేటర్లలో నిజంగానే పూనకాలు తెప్పించడం ఖాయం. మరెందుకు ఆలస్యం.. లైకులు, షేర్‌లతో బాబీపై అభిమానం చూపేందుకు మెగా ఫ్యాన్స్ కాలరేగరేసుకుని మరీ సిద్ధం అయిపోండి. డోంట్ స్టాప్ ఎక్స్‌పెట్టింగ్.. పూనకాలు లోడింగ్.. 

Fans Reaction After Waltair Veerayya Trailer Release:

Bobby.. You Are A True Mega Fan
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs