Advertisement
Google Ads BL

విజయ్ విడాకులు.. ఫ్యాన్స్ పనేనా?


టాలీవుడ్‌లో చిరు, బాలయ్య ఎలా అయితే పోటీ పడుతున్నారో.. కోలీవుడ్‌లో ఈ సంక్రాంతికి అజిత్, విజయ్ కూడా పోటీ పడుతున్నారు. అజిత్ నటించిన ‘తుణివు’, విజయ్ నటించిన ‘వారిసు’ చిత్రాలు కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఢీ కొట్టబోతున్నాయి. విశేషం ఏమిటంటే రెండు చిత్రాలు ఒకే రోజు విడుదలవుతుండటం. ముందుగా వినిపించిన ప్రకారం అజిత్ సినిమా 11వ తేదీన, 12వ తేదీన విజయ్ చిత్రం అని అనుకున్నారు కానీ.. ‘వారిసు’ ట్రైలర్ విడుదల తర్వాత ‘తుణివు’ చిత్రానికి పోటీగానే దించాలని ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు ఫిక్సయ్యారు. దీంతో రెండు సినిమాలు ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగుతున్నాయి. అయితే కోలీవుడ్‌లో విజయ్, అజిత్‌ల మధ్య మంచి స్నేహానుబంధం ఉన్నా.. వారి ఫ్యాన్స్ మధ్య మాత్రం అది లేదు. దీంతో ఇరువురి హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేస్తుంటారు. 

Advertisement
CJ Advs

 

ఆ రచ్చ ఎంత వరకూ వెళ్లిందంటే.. ఒక హీరో ఫ్యాన్స్.. మరో హీరో వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేసేంతగా. వివరాల్లోకి వెళితే.. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో విజయ్ విడాకులు తీసుకుంటున్నాడంటూ వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. విజయ్ తన భార్య సంగీతతో కలిసి రెండు మూడు చోట్ల కనిపించకపోవడంతో.. ఇంకే ముంది విజయ్ విడాకులు అంటూ రూమర్స్ స్టార్ట్ చేశారు. ఇదంతా అజిత్ ఫ్యాన్స్ చేసిన పనిగా కోలీవుడ్ మీడియా రాసుకొస్తుంది. విజయ్, సంగీత హ్యాపీగా ఉన్నారని, వారి మధ్య విడాకులు తీసుకునేంతగా ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని కోలీవుడ్ మీడియా క్లారిటీ ఇస్తుంది. 

 

ఎంత అభిమానం ఉంటే మాత్రం.. మరీ ఇంతగా విజయ్ వ్యక్తిగత జీవితంపై వారు రూమర్స్ క్రియేట్ చేయడంపై ఇతర హీరోల అభిమానులు సైతం మండిపడుతున్నారు. సినిమాల పరంగా అభిమానం, పోటీ ఉండవచ్చు కానీ.. మరీ వ్యక్తిగత జీవితంపై కూడా ఇలా లేనిపోని వార్తలు క్రియేట్ చేయడం సభ్య సమాజానికి ఏమంత మంచిదికాదనే విషయం హీరోలందరి అభిమానులు గుర్తించాలి. అజిత్ మాత్రమే కాదు.. విజయ్ అభిమానులు కూడా ఒక్కోసారి శృతిమించి కామెంట్స్ చేస్తున్నారు. వాటి వల్ల వారి ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడతారని గమనిస్తే మంచిది. అభిమానం ఉండాలి కానీ.. మరీ హద్దులు దాటేలా ఉండకూడదు. ఇకనైనా విజయ్‌పై ఇలాంటి రూమర్స్‌ని ఆపాలని.. ప్రేక్షకలోకం కోరుతోంది.

Thalapathy Vijay divorce Rumours goes Viral:

Who Creates Thalapathy Vijay divorce Rumour
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs