Advertisement
Google Ads BL

బాలయ్యతో.. ఈ జీవితానికి ఇంకేం కావాలి?


‘ఒక అభిమాని.. తను అభిమానించే హీరోని డైరెక్ట్ చేశాడంటే.. ఆ అభిమాని జీవితానికి ఇంకేం కావాలి’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు దర్శకుడు గోపీచంద్ మలినేని. నందమూరి నటసింహం బాలకృష్ణతో ఆయన చేసిన చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఈ సినిమా సంక్రాంతి‌ని పురస్కరించుకుని జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకగా శుక్రవారం ఒంగోలు‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ.. 

Advertisement
CJ Advs

 

‘‘1999లో ఇదే ఒంగోలులో ‘సమరసింహా రెడ్డి’ సినిమా చూడటానికి ఒక అభిమానిలా వెళ్ళా. అక్కడ చిన్న గొడవ జరిగితే రెండు పీకి తీసుకెళ్ళి లోపలేశారు. ఆ సంక్రాంతికి సినిమా ఫస్ట్ షో మిస్ అయిపోయానని చాలా బాధపడ్డా. నైట్ షో చూసి ఇంటికి వెళ్ళిన తర్వాతే ప్రశాంతంగా పడుకున్నా. అలాంటి ఒక బాలయ్య బాబు ఫ్యాన్.. ఈ రోజు బాలయ్య బాబు సినిమాని డైరెక్ట్ చేశాడంటే జీవితంలో ఇంతకంటే ఏం కావాలి. ఒక మాస్ గాడ్‌ని  డైరెక్ట్ చేసే అవకాశం అందరికీ రాదు. బాలకృష్ణ గారిది బంగారు మనసు. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఒక కంటితో దర్శకుడిగా మరో కంటితో అభిమానిగా ఆయన్ని చూశాను. ఈ ప్రయాణం జీవితంలో మర్చిపోలేను. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు గొప్ప సపోర్ట్ ఇచ్చారు. బాలయ్య బాబుని నేను ఎంతఇష్టపడతానో వాళ్ళు అంతే ఇష్టపడతారు. సినిమా అంటే వాళ్ళకి జీవితం. నాకు బ్యాక్‌బోన్‌లా నిలబడ్డారు. ఒక ఫ్యాన్‌గా.. ఫ్యాన్స్ కోరుకునే విధంగా ఆయన్ని ప్రజంట్ చేయాలని ప్రతి క్షణం ఆలోచించాను. బాలయ్య బాబు .. ఐ లవ్ యూ. ఇది ఒక అభిమాని ప్రేమ. బాలయ్య బాబు అంత మంచి మనిషిని చూడలేదు. స్వచ్చమైన మనసు. ఆయనకి చేతులెత్తి దండం పెట్టాలి. ఆయన మామూలు మనిషి కాదు. ఈ సినిమా క్లైమాక్స్ షూట్ జరుగుతున్నపుడు షూట్‌లో సడన్‌గా కిందపడ్డారు. నేను ఒక్కసారిగా షాక్ అయ్యా. ఒక్క సెకన్‌లో లేచి రెడీ అన్నారు. షాక్ తిన్నా. ఆయన డెడికేషన్ చూస్తే .. ఇది కదా మన హీరో అనిపించింది. ఇందుకే ఆయన మాస్ గాడ్ అయ్యారు. జనవరి 12 వీరసింహారెడ్డి విజృంభించబోతున్నాడు. అది ప్రేక్షకులు 12న చూడబోతున్నారు.

 

శృతి హాసన్ అద్భుతమైన నటి. తనతో ఇది మూడో సినిమా. నాకు లక్కీ హీరోయిన్. డ్యాన్స్ కామెడీ ఇరగదీస్తుంది. హనీ రోజ్ మరో ముఖ్యమైన పాత్ర చేసింది. అద్భుతంగా చేసింది. దునియా విజయ్ ఇరగదీశారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ భానుమతిగా కనిపిస్తుంది. బాలయ్య బాబుని ఢీ కొట్టే పాత్ర. అజయ్ ఘోస్, చంద్రరవి, సప్తగిరి అందరూ చాలా చక్కగా చేశారు. సాయి మాధవ్ బుర్రాగారు ఎక్స్‌ట్రార్దినరీ డైలాగ్స్ రాశారు. రామ్ లక్ష్మణ్ మాస్టర్స్, వెంకట్ మాస్టర్, తమన్, డీవోపీ రుషి పంజాబీ, అర్ట్ డైరెక్టర్ ఎఎస్ ప్రకాష్ గారు.. ఇలా మా టెక్నికల్ టీం అంతా నాలుగు గోడల్లా నిలబడ్డారు. వీళ్ళంతా బాలయ్య బాబు అభిమానులే. ఫ్యాన్స్ అంతా కలిసి చేసిన సినిమా ఇది. తమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. నేపధ్య సంగీతం కుమ్మికుమ్మి వదిలేశాడు. సోల్ పెట్టి చేశాడు. సంక్రాంతికి థియేటర్లలో సౌండ్ బాక్స్‌లు దద్దరిల్లడం ఖాయం’’ అని చెప్పుకొచ్చారు.

Gopichand Malineni Speech at Veera Simha Reddy Pre Release Event:

My Life Dream Fulfilled says Director Gopichand Malineni
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs