Advertisement
Google Ads BL

బుల్లితెరపై మెగాస్టార్


మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ హిట్ తర్వాత ఆరు నెలలు తిరక్కుండానే వాల్తేర్ వీరయ్య తో మెగా ఫాన్స్ కి, పండగ పూట ఫ్యామిలీ ఆడియన్స్ కి ట్రీట్ ఇవ్వడానికి సిద్దమైపోయారు. జనవరి 13 న విడుదల కాబోతున్న వాల్తేర్ వీరయ్య ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మాస్ మసాలా చిత్రంలో చిరంజీవి గ్యాంగ్ లీడర్ రోజులు గుర్తుకు తెస్తూ మెగా అభిమానులకి పూనకాలు తెప్పిస్తున్నారు. రేపు శనివారం వాల్తేర్ వీరయ్య ట్రైలర్ అవుతుండగా.. ఆదివారం ప్రీ రిలీజ్ ఈవెంట్ తో హడావిడి చేస్తున్నారు.

Advertisement
CJ Advs

అయితే వాల్తేర్ వీరయ్య ప్రమోషన్స్ లో భాగంగా మెగాస్టార్ చిరు బుల్లితెర మీదకి వచ్చేసారు. సుమ అడ్డాలోకి మెగాస్టార్ చిరు గెస్ట్ గా వచ్చారు. ఈటీవీలో కొత్తగా మొదలు కాబోతున్న సుమ అడ్డా షోకి మెగాస్టార్ వచ్చినట్టుగా మల్లెమాల యాజమాన్యం ప్రకటించింది. మాస్ మూలవిరాట్ చిరంజీవి సుమ అడ్డా షో కోసం విచ్చేశారు అంటూ మెగాస్టార్ రాకని ఫోటో తో కన్ ఫర్మ్ చేసారు. మరి సుమ అడ్డాలో సుమ సంధించే ప్రశ్నలకి మెగాస్టార్ ఎలా రియాక్ట్ అవుతారో అంటూ అప్పుడే ఫాన్స్ ఎదురు చూపులు మొదలు పెట్టేసారు.

మరి సుమ అడ్డా షో ఈటీవీలో రేపు జనవరి 7 శనివారం ప్రసారమవుతుంది అని తెలుస్తుంది. ప్రస్తుతం సుమ అడ్డా ఎపిసోడ్ లో మెగాస్టార్ షూటింగ్ పూర్తికాగా.. ఆయన ఎంట్రీ కోసం మెగా అభిమానులైతే తెగ వెయిట్ చేస్తున్నారు.

Chiranjeevi to shoot for Suma Adda soon:

Suma Kanakala new show Suma Adda
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs