ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా విడుదలై సెన్సేషనల్ హిట్ గా నిలిచి వరల్డ్ వైడ్ గా 1200 కోట్ల కలెక్షన్స్ తో రికార్డులు సృషించిన కన్నడ సంచలనం KGF చిత్రాన్ని పొగిడిన వారే కానీ పొగడని వారు లేదు. కానీ ఇప్పుడొక నటుడు కెజిఫ్ సినిమాని చెత్త సినిమాతో పోల్చాడు. KGF చిత్రం నేను చూడలేదు, అసలు అది నా టైప్ సినిమా కాదంటూ సంచలన వ్యాఖ్యలు చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. కాంతార చిత్రంలో పోలీస్ అధికారిగా నెగెటివ్ షెడ్ లో కనిపించిన కిషోర్ కుమార్ బాలీవుడ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో KGF పై ఇలాంటి వ్యాఖ్యలు చేసాడు.
కాంతారా సినిమాతో బాగా ఫెమస్ అయిన కిషోర్ కుమార్.. తాజాగా కెజిఫ్ పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఆ మీడియా ఇంటర్వ్యూలో కన్నడ సంచలనం KGF పై ప్రశ్న ఎదురు కాగా.. తాను ఇంతవరకు KGF మూవీ చూడలేదు, అదసలు నా టైపు మూవీ కాదు, ఇలా పోలిక తేవచ్చో, లేదో తెలియదు కానీ.. ఇది నా పర్సనల్ విషయం, ఇలాంటి ఓ చెత్త సినిమా చూసేకన్నా హిట్ అవని ఓ సీరియస్ అంశమున్న చిన్న సినిమా చూస్తానికి ఇష్టపడతాను.. అంటూ కామెంట్స్ చేసాడు.
అయితే KGF పై కిషోర్ చేసిన వ్యాఖ్యలు కన్నడలో దుమారాన్ని రేపుతున్నాయి. యశ్ ఫాన్స్, ప్రశాంత్ నీల్ ఫాన్స్ కిషోర్ పై కుమార్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇష్టం లేకపోతే సినిమా చూడకు, అంతేకాని.. సినిమా చూడకుండా KGF చెత్త సినిమా అని ఎలా అంటావ్ అంటూ కిషోర్ పై కోపం వ్యక్తం చేస్తున్నారు.