Advertisement
Google Ads BL

ఫ్యాన్స్‌కి ‘వీరసింహా రెడ్డి’ విజ్ఞప్తి


ఒంగోలులో వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం దృష్ట్యా ఒంగోలులో ట్రాఫిక్ ఆంక్షలు అమలు. ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలు పాటించి పోలీసులకు సహకరించండి.. అని కోరారు ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలికా గార్గ్. 6వ తేదీ ఒంగోలు సమీపాన మండువారిపాలెంలో జరిగే వీరసింహారెడ్డి సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమం దృష్ట్యా వాహనాల రాకపోకలకు, ప్రజా రవాణాకు అంతరాయం కలగకుండా జిల్లా ఎస్పీ ట్రాఫిక్ ఆంక్షలు విధించటమైనది. కావున ప్రజలు ట్రాఫిక్ ఆంక్షలను అనుసరించి పోలీసువారికి సహకరించవలసినదిగా కోరడమైనది. 

Advertisement
CJ Advs

 

వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ కార్యక్రమంకు వచ్చే వాహనాల మార్గములు

1. గుంటూరు, విజయవాడ, చీరాల వైపు నుంచి ప్రీ రిలీజ్ కార్యక్రమంకు వచ్చే వాహనాలు త్రోవగుంట ఫ్లై ఓవర్ ఎక్కకుండా బై లైన్/సర్వీస్ రోడ్‌లో ఎంటరై కిమ్స్ అండర్ పాస్ ద్వారా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కార్యాలయం పార్కింగ్ ఏరియాకు ఎంట్రీ అయ్యి ఈవెంట్ ప్లేస్‌కు వెళ్లవలెను.

ఈవెంట్ పూర్తయి వెళ్లేటప్పుడు ఈ రూటు వారు ఎడమవైపు నుండి NH16 రోడ్డుకి ఎంట్రీ అయ్యి త్రోవగుంట ఫ్లైఓవర్ ఎక్కి వెళ్లవలెను. చీరాల వైపు వెళ్లే వాహనాలు త్రోవగుంట ఫ్లైఓవర్ అండర్ పాస్ నుండి వెళ్లవలెను. 

 

2. నెల్లూరు, కావలి వైపు నుండి ప్రీ రిలీజ్ కార్యక్రమంకు వచ్చే వాహనాలు ఒంగోలు టౌన్‌లోకి ప్రవేశించకుండా పెళ్లూరు ఫ్లై ఓవర్ ఎక్కి కిమ్స్ ఫ్లై ఓవర్ పక్కన గల సర్వీస్ రోడ్డ నుండి కిమ్స్ అండర్ బైపాస్ మీదగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కార్యాలయం పార్కింగ్ ఏరియాకు ఎంట్రీ అయ్యి ఈవెంట్ ప్లేస్‌కు వెళ్లవలెను.

ఈవెంట్ పూర్తయి వెళ్లేటప్పుడు ఈ రూటు వారు.. పార్కింగ్ నుండి త్రోవగుంట ఫ్లైఓవర్ అండర్ పాస్ నుండి యూటర్న్ తీసుకుని కావలి, నెల్లూరు వైపుగా NH16కి ఎంట్రీ అయి వెళ్లవలెను. అలాగే ఒంగోలు సౌత్ బైపాస్ మీదగా రమేష్ సంఘమిత్ర హాస్పిటల్ మీదగా పెళ్లూరు ఫ్లైఓవర్ అండర్ పాస్ ద్వారా NH16కు వెళ్లవలెను.

 

3. ఒంగోలు పట్టణం, కడప, కర్నూలు మరియు చీమకుర్తి వైపు నుండి ఈవెంట్‌కు వచ్చే వాహనాలను కర్నూల్ బైపాస్ సెంటర్ మీదగా.. సర్వీస్ రోడ్డు ద్వారా మంగమ్మ కాలేజీ పార్కింగ్ ఏరియాకు ఎంట్రీ అయి.. ఈవెంట్ ప్లేస్‌కు వెళ్లవలెను. 

వెళ్లేటప్పుడు ఈ రూటు వారు పార్కింగ్ నుండి వెళ్లు వాహనాలు త్రోవగుంట ఫ్లైఓవర్ అండర్ పాస్ నుండి యూటర్న్ తీసుకుని నేరుగా కిమ్స్ ఫ్లైఓవర్ ఎక్కి, పెళ్ళూరు ఫ్లైఓవర్ దిగి యూటర్న్ తీసుకుని, ఒంగోల్ మినీ బైపాస్ మీదగా కర్నూల్, కడప, మరియు చీమకుర్తి రోడ్‌లో గుండా వెళ్లవలెను.

 

4. కొత్తపట్నం వైపు నుండి వచ్చే వాహనాలు కొప్పోలు ఫ్లై ఓవర్ మీదగా కిమ్స్ ఫ్లైఓవర్ పక్కన గల సర్వీస్ రోడ్డు నుండి కిమ్స్ అండర్ పాస్ మీదగా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ కార్యాలయం పార్కింగ్ ఏరియాకు ఎంట్రీ అయ్యి ఈవెంట్ ప్లేస్‌కు వెళ్లవలెను. 

 

5. విజయవాడ, గుంటూరు, చీరాల వైపు నుండి ఒంగోలు టౌన్‌లోకి ప్రవేశించే వాహనదారులు కిమ్స్ ఫ్లైఓవర్ మీదగా కొప్పోలు ఫ్లైఓవర్ సర్వీస్ రోడ్డు మీదగా కొత్తపట్నం బస్టాండ్ మీదుగా ఒంగోలు టౌన్‌లోకి ప్రవేశించవలెను.

ఈ రూటు వారు వెళ్లేటప్పుడు కొత్తపట్నం బస్టాండ్ వైపు నుండి కొప్పోలు ఫ్లైఓవర్‌కు లెఫ్ట్‌సైడ్‌లో గల సర్వీస్ రోడ్డు మీదగా NH16కు వెళ్లి గుంటూరు, విజయవాడ వైపు వెళ్లవలెను. చీరాల వైపు వెళ్లు వాహనాలు కొత్తపట్నం బస్టాండ్ మీదుగా కొప్పోలు ఫ్లైఓవర్‌కు లెఫ్ట్ సైడ్‌లోని సర్వీస్ రోడ్డు ద్వారా NH16 రోడ్డుకు వెళ్లి.. కల్వరి టెంపుల్ ఆపోజిట్ రోడ్‌లోని లెఫ్ట్ సైడ్ సర్వీస్ రోడ్డు ద్వారా త్రోవగుంట ఫ్లైఓవర్ అండర్ పాస్ నుండి చీరాల రోడ్డు వైపు వెళ్లవలెను.

 

మరో విజ్ఞప్తి:

భారీ జనసమూహం మరియు వారి భద్రతను దృష్టిలో ఉంచుకుని మీ పిల్లలు మరియు వృద్ధులను వెంట తీసుకురావద్దని కోరుతున్నాం. దయచేసి సహకరించండి.

Veera Simha Reddy Request to Fans:

Traffic Rules and Regulations to Veera Simha Reddy Pre-Release Event
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs