Advertisement
Google Ads BL

ఎన్నాళ్లకెన్నాళ్లకు సమంత దర్శనం


దాదాపు ఆరు నెలలుగా సమంత పబ్లిక్ లోకి రాలేదు. యశోద ప్రమోషన్స్ అప్పుడు కూడా సుమకి ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది అంతే. యశోద ప్రమోషన్స్ అప్పుడే ఆమె తనకి మాయోసైటిస్ అనే వ్యాధి ఉన్నట్లుగా బయటపెట్టింది. దానివలన నీరసం, అలసట, కండరాలు పట్టెయ్యడం వంటి వాటితో సఫర్ అయిన సమంత కొన్ని నెలలుగా ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటుంది. క్రిస్టమస్ అలాగే న్యూ ఇయర్ వేడుకలకి కూడా దూరంగా ఉన్న ఆమె అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేస్తున్నా.. పబ్లిక్ కి మాత్రం దర్శనమివ్వలేదు.

Advertisement
CJ Advs

కానీ నేడు ముంబై ఎయిర్ పోర్ట్ లో సమంత దర్శనం మీడియాకి దొరికింది. సమంత ముంబై ఎయిర్ పోర్ట్ లో కనిపించగానే ఫోటో గ్రాఫర్స్, వీడియో గ్రాఫర్స్ కెమెరాలకు పని చెప్పడంతో సమంత ఫొటోస్, ఎయిర్ పోర్ట్ వీడియోస్ అన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వైట్ డ్రెస్ లో సమంత ఆరోగ్యంగా, స్టయిల్ గా కనిపించింది. కళ్ళకి గాగుల్స్ పెట్టుకుని స్టయిల్ గా నడిచొస్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో చూడగానే అభిమానులు ఆనందపడిపోతున్నారు.

హమ్మయ్య సమంత కోలుకుంది.. ఇకపై ఆమె మళ్ళీ షూటింగ్స్ తో బిజీ అవుతుంది, విజయ్ దేవరకొండ ఖుషి, వరుణ్ ధావన్ హిందీ ప్రాజెక్ట్ షూటింగ్స్ లో సమంత పాల్గొంటుంది.. ఇకపై ఆమె ఆరోగ్యం విషయంలో ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Samantha Ruth Prabhu is back:

Samantha Ruth Prabhu is back, papped at Mumbai airport 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs