Advertisement
Google Ads BL

స్టార్ హీరోలకి ఎదురు తిరిగిన కింగ్ మేకర్


బాలీవుడ్ లో బడా కింగ్ మేకర్ కరణ్ జోహార్ అంటారు. బడా దర్శకనిర్మాత, స్టార్ కిడ్స్ ని గ్రాండ్ గా లంచ్ చేస్తారని కరణ్ ని అలా అంటుంటారు. స్టార్ కిడ్స్ అంతా కరణ్ జోహార్ ధర్మ ప్రొడక్షన్ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. కరణ్ జోహార్ ఇచ్చే పార్టీలకి గుంపులు గుంపులుగా హాజరవుతారు. అలాంటి కరణ్ జోహార్ బాలీవుడ్ స్టార్స్ పై సంచలన వ్యాఖ్యలు చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. స్టార్స్ కోట్లు పారితోషకం తీసుకుంటారు కానీ..  లాభాలు తెచ్చే సత్తా లేదు.. అంటూ బాలీవుడ్ స్టార్స్ పై కరణ్ జోహార్ సెన్సేషనల్ కామెంట్స్ చేసాడు.

Advertisement
CJ Advs

స్టార్స్ కి పార్టీలిస్తూ తన చుట్టూ తిప్పుకునే కరణ్ జోహార్ ప్రస్తుతం బాలీవుడ్ ఉన్న పరిస్థితిపై ఇలా వ్యాఖ్యానించాడు.యాష్ చోప్రా చెప్పినట్టుగా సినిమా ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు, దాని కోసం మనం పెట్టే బడ్జెట్ బట్టే అది నిర్ణయిస్తుంది. నేను చేసిన స్టూడెంట్ అఫ్ ద ఇయర్ విషయంలో అదే జరిగింది. ఆ సినిమాతో అలియా భట్, సిద్దార్థ్ మల్హోత్రా, వరుణ్ ధావన్ లని స్టార్ లుగా ఇంట్రడ్యూస్ చేశాను, ఆ సినిమా పేరుకే హిట్ అన్నారు. కానీ డబ్బులు రాలేదు, అంతేకాదు పెట్టిన పెట్టుబడి కూడా వెనక్కి రాలేదు. సినిమా కోసం నా మనసు పరితపిస్తుంది. సినిమా అంటేనే ఓ ఎమోషన్. 

ఒక బిజినెస్ మ్యాన్ లా మాట్లాడాలంటే తెలుగు సినిమా లాభదాయంగా ఉంది. అక్కడ లాభాలు వస్తాయి. కానీ హిందీలో బడ్జెట్ కన్నా, నటులకి పారితోషకాలు ఎక్కువయ్యాయి. బడ్జెట్ లో ఎక్కువ మొత్తం పారితోషకాలకే వెళ్లిపోతాయి. ఇలా అంటే నన్ను చంపేస్తారేమో.. అయినా ఓపెనింగ్స్ కి 5 కోట్లు కూడా తేలేరు. కానీ 20 కోట్లు డిమాండ్ చేస్తారు. హిందీ సినిమా పడిపోవడానికి ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉంది అంటూ బాలీవుడ్ స్టార్స్ పై కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు చెయ్యడం కాదు.. ఆల్మోస్ట్ వారికి ఎదురు తిరిగి మాట్లాడాడు. 

Karan Johar rips apart actors who demand Rs 20 crore:

Karan Johar slams actors who ask for 20 cr but can't assure 5 cr opening
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs