ఈరోజు లేవగానే సోషల్ మీడియా చూసిన వారికి హీరో శర్వానంద్ పెళ్లి వార్త విపరీతంగా ఆకర్షించింది. ఇప్పటివరకు బ్యాచులర్ లైఫ్ ని లీడ్ చేసిన శర్వానంద్ త్వరలోనే పెళ్లిపీటలెక్కబోతున్నాడనే న్యూస్ ఆయన అభిమానులకి సంతోషాన్నివ్వగా.. సాధారణ ప్రేక్షకులు హమ్మయ్య ఇప్పటికైనా శర్వా పెళ్లి చేసుకుంటున్నాడని మాట్లాడుకుంటున్నారు. మరి ఇన్నేళ్లు పెళ్లి కోసం వెయిట్ చేసిన శర్వా చేసుకొనే ఆ అమ్మాయి ఎవరా అని అందరూ గూగుల్ లో తెగ వెతికేస్తున్నారు. అయితే శర్వా చేసుకునే అమ్మాయిపై కొద్ది కొద్దిగా ఇన్ఫర్మేషన్ మాత్రమే బయటికి వచ్చింది.
శర్వానంద్ ఇష్టపడిన అమ్మాయి అమెరికాలో సాఫ్ట్ వెర్ జాబ్ చేసుకుంటుందట. ఆమె లాక్ డౌన్ సమయం నుండి వర్క్ ఫ్రేమ్ హోమ్ ఉండడంతో హైదరాబాద్ లోనే ఉండిపోయింది. శర్వానంద్ చేసుకోబోయే అమ్మాయి పక్కా తెలంగాణ అమ్మాయట. రెడ్డి సామజిక వర్గానికి చెందిన అమ్మాయినే శర్వానంద్ వివాహం చేసుకోబోతున్నాడని తెలుస్తుంది. ఇరు కుటుంబాల వారు వీరి వివాహానికి ఒప్పుకోవడంతో.. త్వరలోనే శర్వానంద్ ప్రేమించి ఇష్టపడిన అమ్మాయితోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడంటున్నారు.